Share News

Kumki Elephants: పులిని బంధించేందుకు కుంకీ ఏనుగుల రాక

ABN , Publish Date - Aug 13 , 2025 | 10:59 AM

నీలగిరి జిల్లాలో 13 పశువులను వేటాడిన పులిని బంధించేందుకు రెండు కుంకీ ఏనుగులను రప్పించారు. దేవర్‌సోలై, సర్కార్‌ములై, పాడన్‌తోరై, చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తున్న పులి ప్రజలు పెంచుకునే పశువులను వేటాడుతోంది. పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళనలు చేపడుతున్నారు.

Kumki Elephants: పులిని బంధించేందుకు కుంకీ ఏనుగుల రాక

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో 13 పశువులను వేటాడిన పులిని బంధించేందుకు రెండు కుంకీ ఏనుగులను రప్పించారు. దేవర్‌సోలై, సర్కార్‌ములై, పాడన్‌తోరై, చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తున్న పులి ప్రజలు పెంచుకునే పశువులను వేటాడుతోంది. పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళనలు చేపడుతున్నారు.


nani1.3.jpg

అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలించి, దేవర్‌సోలై, సర్కార్‌ములై తదితర ప్రాంతాల్లో మూడు బోన్లు ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో, పులిని బంధించేందుకు ముదుమలై శరణాలయం నుంచి విజయ్‌, వసీం(Vijay, Vasim) అనే రెండు కుంకీ ఏనుగులను రప్పించి, పులి జాడ కోసం గాలిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్‌ కోబ్రా

నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2025 | 10:59 AM