Rooftop helipad: ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై హెలిప్యాడ్.. ఈ తరహాలో ఇదే మొదటిది
ABN , Publish Date - Jan 17 , 2025 | 06:57 PM
ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ సేవల కోసం దేసున్ హాస్పిటల్ రూఫ్‌టాఫ్ హెలిప్యాడ్ సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జనవరి 14న అనుమతి ఇచ్చింది. తొలి ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై హెలిప్యాడ్‌ను నిర్మించి విజయవంతంగా ట్రయిల్ రన్ నిర్వహించింది. బెహలా ఫ్లైయింగ్ క్లబ్ నుంచి బయలు దేరిన అగస్టా 109 ఎస్‌పీ హెలికాప్టర్ శుక్రవారంనాడు ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై సక్సె్‌స్‌ఫుల్‌గా ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ సేవల్లో ఇదొక కీలకమైన మైలురాయి అని ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ దేసున్ హాస్పిటల్ (Desun Hospital) ప్రకటించింది.
Parliament Session: 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ సేవల కోసం దేసున్ హాస్పిటల్ రూఫ్‌టాఫ్ హెలిప్యాడ్ సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జనవరి 14న అనుమతి ఇచ్చింది. తొలి ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. శుక్రవారంనాడు నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతం కావడంపై దేసున్ ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరెక్టర్ సాజల్ దత్తా సంతోషం వ్యక్తం చేశారు.
''ఇది మా అందరికీ గర్వకారణం. తీవ్ర ప్రాణాపాయంలో చిక్కుకున్న పేషెంట్లకు ఎమర్జెన్సీ సేవలు అందించేందుకు ఈ హెలిఫ్యాడ్ ఎంతో ఉపయోగపడుతుంది. పశ్చిమబెంగాల్‌కు మాత్రమే కాకుండా ఈశాన్య, తూర్పు భారతదేశంలోని వారందిరికీ ఈ అత్యవసర సేవలు అందుబాటులోకి తెస్తాం'' అని సాజల్ దత్తా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Kumbh Mela 2025: కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి.. వివరాల కోసం కాల్ చేయండి..
Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అదే జరిగితే.. సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Read Latest National News and Telugu News