AK Rayaru Gopal: కేరళలో రెండు రూపాయల డాక్టర్ కన్నుమూత
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:08 AM
రెండు రూపాయల డాక్టర్ అని కేరళ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకొనే డాక్టర్ ఏకే రైరు గోపాల్..
తిరువనంతపురం, ఆగస్టు 3: ‘రెండు రూపాయల డాక్టర్’ అని కేరళ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకొనే డాక్టర్ ఏకే రైరు గోపాల్(80) ఆదివారం కన్నుమూశారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో కన్నూర్‌కు చెందిన ఆయన నిరుపేదలు, అనాథల నుంచి కేవలం రూ.2 నామమాత్రపు రుసుము తీసుకుని 50ఏళ్లకు పైగా నిస్వార్థంగా వైద్య సేవలు అందించారు. తెల్లవారుజామున 3.30గంటల నుంచే రోగులను చూడటం ప్రారంభించేవారు. అయన ఇంటి ముందు నిత్యం వందలాది మంది పేషెంట్లు క్యూలో నిలబడేవారు. రోజుకు 300మందిని పైగా పరీక్షించేరు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి