KP Mohanan Manhandled: కేరళ ఎమ్మెల్యేపై స్థానికుల ఆగ్రహం.. అంగన్‌వాడీ కేంద్ర ప్రారంభోత్సవానికి వెళితే..
ABN , Publish Date - Oct 03 , 2025 | 06:43 PM
స్థానిక సమస్యలను పట్టించుకోని ఓ కేరళ ఎమ్మెల్యేపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సెంటర్‌ను ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కేపీ మోహన్ అడ్డుకుని వెనక్కు లాగారు. గురువారం కన్నూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: పారిశుద్ధ్య సమస్యను పట్టించుకోని ఓ కేరళ ఎమ్మెల్యేపై ప్రజాగ్రహం పెల్లుబికింది. అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించేందుకు వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. వారిని లెక్కచేయక ముందుకెళ్లేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను బలవంతంగా వెనక్కులాగే ప్రయత్నం చేశారు స్థానికులు. కన్నూర్ జిల్లాలోని కుతుపారంపు నియోజకవర్గంలో గురువారం నాడు ఎమ్మెల్యే కేపీ మోహన్‌కు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది.
స్థానిక డయాలిసిస్ సెంటర్ నిర్వహణపై అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెంటర్‌లోని వ్యర్థాలను ఎలాంటి వేస్ట్ డిస్పోజల్ ట్రీట్‌మెంట్ లేకుండా బయటకు వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సాయం చేయాలంటే ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. అయితే, ఆయన జోక్యం చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ క్రమంలో గురువారం అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభానికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. అప్పటికే అక్కడకి పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే బాధ్యతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దీంతో, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. నిరసనకారులను లక్ష్య పెట్టక ఎమ్మెల్యే ముందుకెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ఆయనను చేయిపట్టి వెనక్కు లాగేందుకు ప్రయత్నించారు.
కాగా, ఈ ఘటనపై పోలీసులు సుమారు 25 మందిపై కేసులు ఫైల్ చేశారు. అనుమతి లేకుండా భారీగా గుమిగూడటం, ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. అయితే, సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యే ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
సైబర్ నేరాలు.. తన కూతురి షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న అక్షయ్ కుమార్
లంచం కోసం కస్టమ్స్ అధికారుల వేధిస్తున్నారన్న లాజిస్టిక్స్ సంస్థ.. కార్యకలాపాల నిలిపివేత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి