Share News

Arvind Kejriwal: రూ.8,400 కోట్ల విమానంలో తిరిగేది, రూ.10 లక్షల సూట్ వేసుకునేదెవరు?

ABN , Publish Date - Jan 03 , 2025 | 07:54 PM

ప్రధాని శుక్రవారంనాడు 43 గంటల సేపు ప్రసంగిస్తే అందులో 39 నిమిషాలు ఢిల్లీ ప్రజల్ని, ఆ ప్రజలు అఖండ మెజారిటీతో విజయం కట్టబెట్టిన "ఆప్'' ప్రభుత్వాన్ని దుయ్యబట్టారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Arvind Kejriwal: రూ.8,400 కోట్ల విమానంలో తిరిగేది, రూ.10 లక్షల సూట్ వేసుకునేదెవరు?

న్యూఢిల్లీ: ప్రజలు ఎన్నుకున్న 'ఆప్' ప్రభుత్వాన్ని 'విపత్తు' (AAPda) ప్రభుత్వమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శలు చేయడాన్ని ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తప్పుపట్టారు. ప్రధాని శుక్రవారంనాడు 43 గంటల సేపు ప్రసంగిస్తే అందులో 39 నిమిషాలు ఢిల్లీ ప్రజల్ని, ఆ ప్రజలు అఖండ మెజారిటీతో విజయం కట్టబెట్టిన "ఆప్'' ప్రభుత్వాన్ని దుయ్యబట్టారని అన్నారు. 2015లో ఢిల్లీ ప్రజలు ఢిల్లీకి రెండు ప్రభుత్వాలను ఎన్నుకున్నారని, ఒకటి బీజేపీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రెండవది ఆప్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికి పదేళ్లయిందని, ఈ పదేళ్లలో ఆప్ ప్రభుత్వం ఏమి చేసిందని అడిగితే దానిపై మాట్లాడేందుకు తనకు 2-3 గంటలు కూడా సరిపోవని అన్నారు.

PM Modi: నేను కూడా శీష్ మహల్ కట్టగలను.. కేజ్రీపై మోదీ చురకలు


గత పదేళ్లులో ఢిల్లీని సగం బీజేపీ (కేంద్రం), మరో సగం ఆప్ పాలించగా, మురుగునీటి వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా మెరుగుపరించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఢిల్లీకి కేంద్రం ఏమి చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. వ్యాపారవేత్తలను డబ్బుల కోసం బెదిరిస్తూ కాల్స్ రావడం, పట్టపగలే ప్రజలు హత్యకు గురికావడం వంటివి చోటుచేసుకున్నాయని, ఢిల్లీలో ఇప్పుడు పరిస్థితి చాలాదారుణంగా ఉందని, దానికి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.


''పదేళ్లలో వాళ్లు (కేంద్రం) ఢిల్లీకి ఏదైనా చేసి ఉంటే ఇవాళ ఇంతగా ఆడిపోసుకునే వారు కారు. పని చేసిన వాళ్లని నిందిస్తారు. పని చేయని వాళ్లు కేవలం నిందారోపణలు చేస్తూ ఎన్నికలకు వెళ్తారు. 2020లో ఢిల్లీ ప్రజలకు మోదీ చాలా వాగ్దానాలు చేశారు. 2022 నాటికి ఢిల్లీలోని ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు కల్పిస్తామని 2020-సంకల్ప పాత్రలో చెప్పారు. 2020 నుంచి ఇప్పటి వరకూ 1,700 ఇళ్లకు మోదీ తాళం చెవులు ఇచ్చారు. దీనికి ముందుకు కల్కాజీలో 3,000 ఇళ్లు అప్పగించారు. ఆ ప్రకారం ఐదేళ్లలో 4,700 ఇళ్లు కట్టారు. ఢిల్లీలో 4 లక్షల మురికివాడలు, 15 లక్షల మందికి ఇళ్లు అవసరం'' అని కేజ్రీవాల్ చెప్పారు.


అద్దాల మేడ ప్రస్తావనపై..

ప్రధానమంత్రి తన ప్రసంగంలో చేసిన అద్దాల మేడ (Sheesh Mahal) ప్రస్తావనను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. రూ.2,700 కోట్లతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి, రూ.8,400 కోట్ల విమానంలో ప్రయాణించే వ్యక్తి, రూ.10 లక్షల సూట్ ధరించే వ్యక్తి అద్దాల మేడ గురించి మాట్లాడటం సరికాదన్నారు. తానెప్పుడూ వ్యక్తిగత ఆరోపణలకు, రాజకీయ నిందల జోలికి వెళ్లలేదని కేజ్రీవాల్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

CT Ravi: సువర్ణసౌధ ఘటనపై సీటీ రవి ఆగ్రహం

Flights Delayed: ప్రయాణికులకు అలర్ట్.. దాదాపు 200 విమానాలు ఆలస్యం, రద్దు

For National News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 08:37 PM