Amit Shah: కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే ఇప్పుడు బిల్లు వచ్చేదే కాదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:16 PM
పీఎం, సీఎం, కేంద్రం మంత్రులను తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు అవసరాన్ని అమిత్‌షా కేరళలో మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో బలంగా చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన గత 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి బిల్లు రాలేదన్నారు.
న్యూఢిల్లీ: తీవ్ర నేరాలతో అరెస్టయి 30 రోజులు జైలులో గడిపిన పీఎం, సీఎం, కేంద్రం మంత్రులను తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు అవసరాన్ని అమిత్‌షా కేరళలో మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో బలంగా చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన గత 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి బిల్లు రాలేదన్నారు. రాజ్యాంగంలో నైతిక విలువల అవసరాన్ని ఈ బిల్లు చాటిచెబుతోందని తెలిపారు.
'ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటారా? అసలు ఇదెలాంటి చర్చ? నాకు అర్ధం కావడం లేదు. ఇది నైతికతకు సబంధించిన ప్రశ్న. రాజ్యాంగంలో ఇంతకుముందు దీనిని ఎందుకు చేర్చలేదని ఇప్పుడు వాళ్లు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో జైలుకు వెళ్లే వ్యక్తులు ప్రజాప్రతినిధులు అవుతారని రాజ్యాంగకర్తలు ఊహించి ఉండకపోవచ్చు' అని అమిత్‌షా అన్నారు.
అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్, ఆయన రాజీనామా చేయడానికి నిరాకరించిన విషయాన్ని అమిత్‌షా ప్రస్తావిస్తూ, ఒక ముఖ్యమంత్రి జైలులో నుంచే ప్రభుత్వాన్ని నడిపారని, అలాంటప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలా? వద్దా? అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఢిల్లీలో అధికారంలో ఉందని, అయితే తమకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని అన్నారు. అరెస్టు అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే కొత్త బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందేదని కాదని అమిత్‌షా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News