Share News

Uttarakhand: కేదార్‌‌నాథ్ యాత్ర మూడు రోజులు నిలిపివేత

ABN , Publish Date - Aug 13 , 2025 | 07:46 PM

ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జవాది పోలీస్ స్టేషన్ దాటి ముందుకు వెళ్లరాదని యాత్రికులను జిల్లా పోలీసులు కోరారు. సోన్‌ప్రయోగ్‌కు ఇప్పటికే చేరుకున్న వారిని అక్కడనే ఉండాల్సిందిగా కోరారు. ఆంక్షల అమల్లో భాగంగా సోన్‌ప్రయాగ్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Uttarakhand: కేదార్‌‌నాథ్ యాత్ర మూడు రోజులు నిలిపివేత
Kedarnath

డెహ్రాడూన్: భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కేదార్‌నాథ్ థామ్ యాత్ర (Kedarnath Dhan Yatra)ను మూడు రోజుల పాటు నిలిపివేశారు. ఈనెల 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భద్రతా కారణాల రీత్యా పరిస్థితులు మెరుగుపడేంత వరకూ భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రుద్రప్రయాగ్ జిల్లా అధికారి యంత్రాంగం కోరింది.

జవాడీ, సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రికుల నిలిపివేత

ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జవాది పోలీస్ స్టేషన్ దాటి ముందుకు వెళ్లరాదని యాత్రికులను జిల్లా పోలీసులు కోరారు. సోన్‌ప్రయోగ్‌కు ఇప్పటికే చేరుకున్న వారిని అక్కడనే ఉండాల్సిందిగా కోరారు. ఆంక్షల అమల్లో భాగంగా సోన్‌ప్రయాగ్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

యాత్రికులతో వివాదం

కాగా, మంగళవారం ఉదయం సుమారు 100 నుంచి 150 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ్ చేరుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. దీంతో యాత్రికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చెలరేగింది. బారికేట్లు దాటేందుకు కొందరు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే అధికారులు జోక్యం చేసుకుని భక్తులను ముందుకు వెళ్లకుండా నిలువరించినట్టు ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కోండే తెలిపారు. యాత్రను నిలిపివేసే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు. ఆంక్షలు తాత్కాలికమేనని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేవలం భక్తుల భద్రత దృష్ట్యా ఆంక్షలు అమల్లోకి వచ్చాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ టారిఫ్ బెదిరింపుల వేళ.. మాస్కోకు జైశంకర్

మా వద్ద బ్రహ్మోస్ ఉన్నాయ్... పాక్ ప్రధానిపై ఒవైసీ మండిపాటు

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 07:49 PM