India Reaffirms Bilateral Stand: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు.. విదేశాంగ శాఖ స్పష్టీకరణ
ABN , Publish Date - May 13 , 2025 | 10:20 PM
భారత్, పాక్‌లకు సంబంధించి ద్వైపాక్షిక అంశం కశ్మీర్ అని విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ అంశం భారత్, పాక్‌లకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఆమోదించమని పేర్కొంది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు ప్రకటించారు.
‘‘కశ్మీర్ అంశం భారత్, పాక్‌లకు చెందినదని మేము ఎంతోకాలంగా చెబుతున్నాము. ఈ విధానంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. పాక్ జమ్మూకశ్మీర్‌ను చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకుంది’’ అని అన్నారు. ట్రంప్ ఆఫర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు రణ్‌ధీర్ జైస్వాల్ ఈ మేరకు కామెంట్ చేశారు. ఇక డొనాల్ట్ ట్రంప్ పేర్కొన్న అణుయుద్ధ ముప్పుపై కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. సంప్రదాయ విధానంలోనే మిలిటరీ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
‘‘పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం జరుగుతుందని మే 10న కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ దీన్ని ఆ తరువాత కొట్టి పారేసింది. అసలు ఈ కోణం లేనేలేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు.’’అని జైస్వాల్ అన్నారు.
‘‘అణుబాంబు ప్రయోగాల బ్లాక్‌మెయిల్‌కు భారత్ లొంగదని మేము ముందే చెప్పారు. దీన్ని అడ్డం పెట్టుకుని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని సహించము. ఇతర దేశాలతో చర్చల సందర్భంగా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాము’’ అని అన్నారు. పాక్‌లో ఉగ్రవాదం ఓ పరిశ్రమగా మారిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్‌లో ధ్వంసం అయిన టెర్రరిస్టు నెట్‌వర్క్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అమయాకుల మరణాలకు కారణమయ్యారని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ఎస్-400లు కావాలి.. రష్యాకు భారత్ అధికారిక అభ్యర్థన
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు
మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..