Share News

Karnataka Vedic school: విద్యార్థిని కింద పడేసి.. కాలితో తన్ని.. వేద పాఠశాల టీచర్ ఘాతుకం..

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:41 PM

కర్ణాటకలోని ఓ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. మంచి, మర్యాద నేర్పాల్సిన గురువు విద్యార్థి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. చిన్న తప్పు చేసినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని దారుణంగా హింసించాడు.

Karnataka Vedic school: విద్యార్థిని కింద పడేసి.. కాలితో తన్ని.. వేద పాఠశాల టీచర్ ఘాతుకం..
Karnataka Vedic school

కర్ణాటకలోని ఓ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. మంచి, మర్యాద నేర్పాల్సిన గురువు విద్యార్థి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. చిన్న తప్పు చేసినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని దారుణంగా హింసించాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ ఘటన కర్ణాటక జిల్లా చిత్రదుర్గ జిల్లాలో వెలుగులోకి వచ్చింది (teacher thrashes student).


చిత్రదుర్గ జిల్లాలోని నాయక్నహట్టిలోని ఓ వేద పాఠశాలలో చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల బాలుడు అనుమతి లేకుండా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాడనే కారణంగా ప్రధానోపాధ్యాయుడు వీరేశ్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ కుర్రాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నాడు. ఆ కుర్రాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా తన ప్రతాపం చూపించాడు (student beaten by teacher video).


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (corporal punishment Karnataka). పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం వీరేశ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పిల్లలు చేసే చిన్న తప్పులను కూడా క్షమించలేని వీరేశ్ అందరినీ ఇష్టం వచ్చినట్టు కొడతాడని ఆ పాఠశాలు సిబ్బంది పోలీసులకు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..


మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2025 | 12:41 PM