Share News

Love Marriage: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లికోసం ప్రియుడి మాస్టర్‌ప్లాన్.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..!

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:40 PM

అనగనగా ఓ అబ్బాయి.. ఆ అబ్బాయికి తోడుగా ఓ అమ్మాయి.. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అతగాడు ఫిక్స్ అయిపోయాడు. మరి పెళ్లంటే ఆషామాషీ కాదుగా..

Love Marriage: గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లికోసం ప్రియుడి మాస్టర్‌ప్లాన్.. అంతలోనే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..!

బెంగళూరు, అక్టోబర్ 10: అనగనగా ఓ అబ్బాయి.. ఆ అబ్బాయికి తోడుగా ఓ అమ్మాయి.. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అతగాడు ఫిక్స్ అయిపోయాడు. మరి పెళ్లంటే ఆషామాషీ కాదుగా.. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మరి ఆ అబ్బాయి వద్దేమో పెద్ద మొత్తంలో కాదు కదా.. మోస్తరు డబ్బులు కూడా లేవు. మరి పెళ్లి చేసుకోవడం ఎలా? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం ఎలా? అని ఆలోచించసాగాడు. అప్పుడు అతని బుర్రలో పాడు ఆలోచనలు మొలకెత్తాయి. అప్పటి వరకు మనిషిలా ఉన్నోడు.. ఆ ఆలోచన రావడమే ఆలస్యం పెద్ద పెద్ద క్రైమ్ ప్లాన్స్ వేయసాగాడు. ఎక్కడో తెలియని ప్లేస్‌లలో ఎందుకు.. తెలిసిన ప్లేస్‌లలో అయితే రిస్క్ తక్కువ, పెద్దగా అనుమానమూ రాదని భావించాడు. అనుకున్నదే తడవు.. తన మనసులో పుట్టిన దరిద్రపు ఆలోచనను అమలు చేశాడు. అయితే, ఇతగాని తెలివి తేటల కంటే.. ఖాకీల తెలివితేటలు చాలా ఎక్కువేనాయే.. ఇంకేముంది.. వారి విచారణలో అడ్డంగా బుక్కైపోయాడు.. ఫలితంగా ప్రియురాలితో పెళ్లి ఏమో గానీ.. జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మరి ఇంతకీ ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి అతను చేసిన ప్లాన్ ఏంటి? ఆ తరువాత జరిగిన పరిణామాలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


బెంగళూరుకు చెందిన శ్రేయాస్ (22) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే, పెళ్లి చేసుకోవడానికి తన వద్ద డబ్బులు లేవు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని భావించాడు. కష్టపడితే డబ్బులు వెంటనే రావు కదా.. అందుకే చోరీ చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా.. తన బంధువులలో ఒకరి ఇంటిని టార్గెట్ చేశాడు. తన బంధువైన హరీష్ ఇంటిని శ్రేయాష్ లక్ష్యంగా చేసుకున్నాడు. వారు ఇంట్లో లేని సమయంలో శ్రేయాస్ చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న 416 గ్రాముల బంగారం, రూ.3.46 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.


అయితే, ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన హరీష్, అతని కుటుంబ సభ్యులు.. బెంగళూరులోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూ్స్, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. చోరీ చేసింది శ్రేయాస్ అని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు మ్యాటర్ రివీల్ చేశాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు డబ్బులు అవసరం ఉందని.. అందుకే ఈ చోరీ చేసినట్లు పోలీసులకు వివరించాడు శ్రేయాస్. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 44 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.


Also Read:

ప్రపంచ తెలుగు మహాసభలు.. పెయింటింగ్స్‌కు ఆహ్వానం

రాహుల్‌కు పట్టిన గతే తేజస్వికి పడుతుంది

Updated Date - Oct 11 , 2025 | 09:42 PM