Share News

Kamal Haasan: మేము ఏ సైడూ కాదు, ప్రజాపక్షం.. కరూర్ తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించిన కమల్

ABN , Publish Date - Oct 06 , 2025 | 09:45 PM

కరూర్ విషాద ఘటనలో తమ సొంతవారిని కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు తాను ఇక్కడకు వచ్చానని కమల్ తెలిపారు. ఈ ట్రాజెడీని అంకెలతో చూడొద్దని, వాళ్లను తల్లులుగా, సోదరీమణులుగా, పెద్దలుగా చూడాలని కోరారు.

Kamal Haasan: మేము ఏ సైడూ కాదు, ప్రజాపక్షం.. కరూర్ తొక్కిసలాట ప్రాంతాన్ని సందర్శించిన కమల్
Kamal Haasan in Karur

కరూర్: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన ప్రాంతాన్ని మక్కల్ నీది మయ్యం (MNM) చీఫ్, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్ (Kamal Haasan) సోమవారంనాడు సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలుసుకుని వారిని ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఇది క్షమాపణలు చెప్పే సమయం, పొరపాట్లను ఒప్పుకునే సమయం' అని అన్నారు.


తమిళ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ (Vijay) ఈనెల 27న కరూర్‌లో జరిపిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాట తీవ్ర సంచలనం రేపింది. కరూర్ విషాద ఘటనలో తమ సొంతవారిని కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు తాను ఇక్కడకు వచ్చానని కమల్ తెలిపారు. ఈ ట్రాజెడీని అంకెలతో చూడొద్దని, వాళ్లను తల్లులుగా, సోదరీమణులుగా, పెద్దలుగా చూడాలని, కోర్టు విచారణలో ఉన్నందున దీనిపై తాను వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.


'నేను సెంట్రిస్టుని, తమిళనాడు పౌరుడుని. ఈ అంశంపై ఏ పక్షం తీసుకోను. ఏదో ఒక పక్షం తీసుకోవాల్సి వస్తే ప్రజాపక్షం తీసుకుంటాను' అని క మల్ అన్నారు. ముఖ్యమంత్రి అసాధరణ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

దాడిపై ప్రతి ఒక్క భారతీయుడు అగ్రహంతో ఉన్నారు.. సీజేఐతో మాట్లాడిన మోదీ

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

Read Latest Telangana News and National News

Updated Date - Oct 06 , 2025 | 10:12 PM