Share News

MahaKumbhamela: ప్రయాగ్ రాజ్‌లో జ్యూడిషియల్ కమిటీ విచారణ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 08:59 PM

MahaKumbhamela: మౌని అమావాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై నియమించిన జ్యూడిషియల్ కమిటి సభ్యులు శుక్రవారం ప్రయాగ్ రాజ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా తొక్కిసలాట చోటు చేసుకోవాడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

MahaKumbhamela: ప్రయాగ్ రాజ్‌లో జ్యూడిషియల్ కమిటీ విచారణ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

పాట్నా, జనవరి 31: ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహాకుంభమేళలో మౌని అమావాస్య సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. మరో 50 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు శుక్రవారం ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు.

తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగిన తీరును స్థానికులకు అడిగి వారు స్వయంగా తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా ఉన్నతాధికారులతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. ఈ కమిషన్ బృందం 5 అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది..

Also Read : దమ్ముంటే అక్కడికి రా.. నువ్వో నేనో చూసుకుందాం..

Also Read : ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’


maha-kumbhamela.jpg

1)

ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించడం.. ఎలాంటి పరిస్థితుల్లో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దీని వెనుక ఏమైనా పరిపాలనాపరమైన నిర్లక్ష్యం ఉందా?, భద్రత లేక పోవడం లేకుంటే క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో లోపాలు ఉన్నాయా? అనే విషయాలను కమిషన్ పరిశీలిస్తోంది.

2)

క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తోపాటు భద్రతా పరమైన చర్యలపై దర్యాప్తు.. మహా కుంభ మేళ సమయంలో రద్దీ నియంత్రణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు. అవి సరిపోతాయా? లేదా? అనే అంశాలను పరిశీలించనున్నారు. అలాగే భద్రతా చర్యల ప్రభావంపై సైతం సమీక్షించనున్నారు.

3)

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌తోపాటు వైద్య సహాయం.. ప్రమాదం జరిగిన తర్వాత అత్యవసర సేవల సంసిద్ధత, గాయపడిన వారికి అందించిన వైద్య సహాయంలో నాణ్యతను పరిశీలించనున్నారు. అలాగే క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందుతుందో లేదో అనే కోణాన్ని సైతం పరిశీలించనున్నారు.

4)

అడ్మినిస్ట్రేటివ్, పోలీసు ఉన్నతాధికారుల పాత్ర.. సంఘటన జరిగిన సమయంలో అడ్మినిస్ట్రేటివ్, పోలీసు అధికారుల పాత్ర ఏమిటి, వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించారా? అనే కోణంలో ఈ న్యాయ కమిషన్ దర్యాప్తు చేయనుంది.

5)

భవిష్యత్తు ఈ తరహా ఘటనలు చోటు చేసుకోండా ఉండేందుకు పలు సిఫార్సులు.. ఈ ఘటనను లోతుగా పరిశీలించి.. దాని ఆధారంగా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన సిఫార్సులను ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదిక రూపంలో అందజేయనుంది. తద్వారా భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో మెరుగైన నిర్వహణతోపాటు భద్రతను ఏర్పాటు చేయవచ్చు.

Also Read : సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు.. అసలు విషయం ఏమిటంటే..?


మరోవైపు న్యాయ కమిషన్ సభ్యులు ప్రయాగ్ రాజ్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఈ తొక్కిసలాటలోని మృతుల బంధువులు.. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద చేరుకున్నారు. ఆ క్రమంలో వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి..వారిని పక్కకు తొలగించారు.

Also Read : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


ఈ సమయంలో, కమీషన్ ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, పరిపాలనా అధికారులు మరియు ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తుంది, తద్వారా సంఘటనపై సమగ్ర మరియు నిష్పక్షపాత దర్యాప్తు నిర్ధారించబడుతుంది. అయితే, ప్రయాగ్‌రాజ్‌లో న్యాయ కమిషన్‌కు కూడా వ్యతిరేకత ఎదురైంది.

Also Read : ఈ ఏడాది ‘మహానాడు’ ఎక్కడంటే..?


మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మొత్తం 30 మంది భక్తులు మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం వారిలో 24 మందిని వారి బంధువులు ఇంటికి పంపించారు. మరో 36 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Also Read : రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు


అలాగే ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో ఈ ఘటనపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తుల బృందం శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తి హర్ష్‌కుమార్‌ నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో మాజీ డీజీపీ వీకే గుప్తాతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ బీకే సింగ్ సైతం సభ్యులుగా ఉన్నారు.

For National News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 09:11 PM