Share News

JEE Main Results: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Feb 11 , 2025 | 08:26 PM

JEE Main Results: జేఈఈ మెయిన్​ మొదటి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 14 మంది వంద పర్సంటైల్ సాధించారు. వారి జాబితాలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

JEE Main Results: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: జేఈఈ మెయిన్​ మొదటి సెషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా బాలికల కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన గుత్తికొండ మనోజ్ఞ తన సత్తా చాటింది. 100 పర్సంటైల్ సాధించిన ఏకైక బాలికగా నిలిచింది. ఇక తెలంగాణ నుంచి బని బ్రాత సైతం 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వంద పర్సంటైల్ సాధించారు. ఆ జాబితాలో వీరిద్దరు ఉన్నారు.

జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షను జనవరి 22 వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జేఈఈ మెయిన్ మొదటి సెషన్‌కి మొత్తం 13.11 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12.58 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. మరోవైపు రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.

జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్ సాధించి అగ్రస్థానంలో నిలచారు. ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జరగనుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 08:26 PM