Share News

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా.. మీకు ఏ అనుమానం ఉన్నా ఇలా చేయండి

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:24 PM

JEE Main 2025: ఈనెల 22 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు మొదలవగా.. ఈరోజుతో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్స్ పూర్తి అయ్యాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1ను నిర్వహించగా.. చివరి రోజు(జనవరి 30న) బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2ను నిర్వహించారు.

JEE Main 2025: జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా.. మీకు ఏ అనుమానం ఉన్నా ఇలా చేయండి
JEE mains 2025

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటితో ముగిశాయి. జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం దేశవ్యాప్తంగా రెండు పేపర్లు కలిపి 12 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ఈనెల 22 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు మొదలవగా.. ఈరోజుతో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్స్ పూర్తి అయ్యాయి. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1ను నిర్వహించగా.. చివరి రోజు (జనవరి 30న) బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌-2ను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన కొన్ని వారాల తర్వాత ఫలితాలు విడుదల అవుతాయి. జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరి 12, 2025న విడుదలకానున్నాయి.


అభ్యంతరాలు తెలిపేందుకు..

అలాగే జేఈఈ మెయిన్స్‌లో తదుపరి దశలో ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. దీనిని jeemain.nta.nic.in వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇది రెండు లేదా మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ప్రతీ ప్రశ్నకు నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి... ఆ తరువాత తమ అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో చేసిన ఆన్‌లైన్, పెయిడ్ ఛాలెంజ్లను మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్వీకరించే అవకాశం ఉంది. ఆధారాలు లేని అభ్యంతరాలను లేవనెత్తితే వాటిని పరిగణలోకి తీసుకోరు.

పగలు పూజలు.. రాత్రుళ్లు దోపిడీలు


విద్యార్థులు వ్యక్తపరిచిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి ఆపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత ఎన్టీఏ వెబ్సైట్ https://jeemain.nta.nic.in లో ఫైనల్ ఆన్సర్ కీని ప్రకటిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు. అలాగే పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లేదా ntaresults.nic.inలో వారి జేఈఈ మెయిన్ 2025 సెషన్ ఫలితం, స్కోర్లు అర్హత స్థితిని తెలుసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2025 ఫలితం సెషన్ 1ను తనిఖీ చేసేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఉపయోగించి ఫలితాలు తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి...

Delhi Assembly Elections: కేజ్రీవాల్‌ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?

Fire Accident : మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..

Read Latest National News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:24 PM