Share News

Pakistan Militants Attack: పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ..

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:32 PM

ఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని బత్తల్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలి ఐదుగురు పాక్ ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత వైపునకు ఉగ్రవాదులు కంచె దాడుతున్న సమయంలో మందుపాతర పేలింది.

Pakistan Militants Attack: పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ..
Jammu and Kashmir

ఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌ (Jammu and Kashmir)లో శుక్రవారం సుమారు 12 మంది పాక్ ఉగ్రవాదులు (Pakistan Militants) హతమయ్యారు. కృష్ణా ఘాటీ సెక్టార్‌ (Krishna Ghati Sector) వద్ద ఏడుగురు పాక్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. దాడి చేసి కృష్ణా ఘాటీ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే వారి చొరబాటు ప్రయత్నాలను భారత సైన్యం (Indian Army) సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆకస్మిక దాడి చేసిన పాక్ ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు మృతిచెందారు.

Viral News: మహాకుంభమేళాకు అమ్మాయిలు.. వారు చేసిన పనికి భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా..


మరోవైపు జమ్మూకాశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని బత్తల్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలి ఐదుగురు పాక్ ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత వైపునకు ఉగ్రవాదులు కంచె దాడుతున్న సమయంలో మందుపాతర పేలింది. ఓ ఉగ్రవాది ల్యాండ్‌మైన్ మీద కాలివేయడంతో ఈ సంఘటన జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల వద్ద ఐఈడీ కూడా ఉందని ల్యాండ్‌మైన్‌తోపాటు ఐఈడీ కూడా పేలిపోయినట్లు వెల్లడించారు. భారత్‍లోకి ఉగ్రవాదులు ప్రవేశించకుండా ఇండియన్ ఆర్మీ.. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ మైన్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Election Commission: రాతపూర్వకంగా స్పందిస్తాం.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఓట్లు తొలగిస్తారని మీకు తెలుసా.. ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..

Updated Date - Feb 07 , 2025 | 05:51 PM