Share News

Jaipur Literature Festival 2026: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2026.. వక్తల మొదటి జాబితా ఇదే..

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:24 PM

భూమిపై గొప్ప సాహిత్య ప్రదర్శనగా గుర్తింపు పొందిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 19వ ఎడిషన్, 2026 జనవరి 15 నుంచి 19 వరకు రాజస్థాన్‌లోని పింక్ సిటీ ఆఫ్ జైపూర్‌కు హోటల్ క్లార్క్స్ అమెర్‌లో జరగబోతోంది. ఈ ఉత్సవం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఎంతో మంది రచయితలను, సాహితీ ప్రియులను అలరిస్తోంది.

Jaipur Literature Festival 2026: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2026.. వక్తల మొదటి జాబితా ఇదే..
Jaipur Literature Festival 2026

భూమిపై గొప్ప సాహిత్య ప్రదర్శనగా గుర్తింపు పొందిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 19వ ఎడిషన్.. 2026 జనవరి 15 నుంచి 19 వరకు రాజస్థాన్‌లోని పింక్ సిటీ ఆఫ్ జైపూర్‌ హోటల్ క్లార్క్స్ అమెర్‌లో జరగబోతోంది. ఈ ఉత్సవం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఎంతో మంది రచయితలు, సాహితీ ప్రియులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డు గెలుచుకున్న రచయితలు, ఆలోచనాపరులు, కళాకారులతోపాటు పాఠకులను ఒకచోట చేర్చుతోంది (literary festival India).

Literaturefestival.jpg


జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 19వ ఎడిషన్‌లో ఆరు వేదికలలో 350 మందికి పైగా వక్తలు పాల్గొంటారు. ఫిక్షన్, కవిత్వం, చరిత్ర, కళ, సైన్స్, గణితం, వైద్యం, మానసిక ఆరోగ్యం, వాతావరణం, వ్యాపారం, భౌగోళిక రాజకీయాలు, అనువాదాలు, సినిమా, జాతి, గుర్తింపు మొదలైన వాటిపై వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ ఫెస్టివల్ ప్రెజెంటింగ్ పార్టనర్‌గా వేదాంత అన్ని ఏర్పాట్లూ చేస్తోంది (JLF 2026 speakers).

Literaturefestival2.jpg


ఈ ఫెస్టివల్‌లో ప్రసంగించే వ్యక్తుల మొదటి జాబితాను తాజాగా విడుదల చేశారు (authors speaking at JLF). వారిలో అనామిక, ఆనంద్ నీలకంఠన్, అనురాధ రాయ్, బాను ముస్తాక్, భావన సోమయ్య, ఎడ్వర్డ్ లూస్, ఎలియనోర్ బరాక్లాఫ్, గోపాలకృష్ణ గాంధీ, హాలీ రూబెన్‌హోల్డ్, హర్లీన్ సింగ్ సంధు, హెలెన్ మోల్స్‌వర్త్, జోన్ లీ ఆండర్సన్, కేఆర్ జోసెఫ్, కె.ఆర్. మెహత్సేరా, కె.ఆర్. ఓల్గా టోకర్జుక్, తిమోతీ బెర్నర్స్-లీ, రష్మీ నార్జారీ, రుచిర్ జోషి, సల్మా, శోభా డే, స్టీఫెన్ ఫ్రై, విశ్వనాథన్ ఆనంద్ మొదలైన వారు ఉన్నారు.

Literaturefestival3.jpg


ఇవి కూడా చదవండి..

ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 08:29 PM