Honour Violence: నడిరోడ్డులో ఐటీ ఉద్యోగి హతం
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:23 AM
తమిళనాడులో ఓ యువకుడు సోమవారం పరువు హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి జిల్లాలోని ఆరుముగమంగళం..
తమిళనాడులో పరువుహత్య
చెన్నై, జూలై 28(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ఓ యువకుడు సోమవారం పరువు హత్యకు గురయ్యాడు. తూత్తుకుడి జిల్లాలోని ఆరుముగమంగళం ప్రాంతానికి కవిన్‌కుమార్(26) చెన్నై ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవులకు స్వస్థలానికి వెళ్ళిన కవిన్‌కుమార్ తన తాతకు అస్వస్థతగా ఉండటంతో ఆదివారం ఉదయం పాళయంకోటలో ఉన్న సిద్ధ వైద్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కవిన్‌కుమార్ ఆస్పత్రి బయట నిలబడి ఉండగా బైకుపై వచ్చిన ఓ యువకుడు అతడిని పిలిచి, కొంత దూరం తీసుకువెళ్లి కత్తితో దాడి చేయడంతో కవిన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పాళయంకోట పోలీసులు వెళ్ళి కవిన్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ హత్య చేసింది పాళయం కోట కేటీసీ నగర్ ప్రాంతానికి చెందిన సుర్జిత్ (24)గా గుర్తించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు సుర్జిత్‌ను అరెస్టుచేసి, రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారించగా కవిన్‌కుమార్‌ది పరువుహత్యగా తేలింది. విచారణ అనంతరం సుర్జిత్‌పై హత్య, అంటరానితనం నిరోధక చట్టం సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..