Priyanka Gandhi : ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ రాయబారి మండిపాటు
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:10 PM
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందని, వారిలో 18,430 మంది చిన్నారులేనని..
న్యూ ఢిల్లీ, ఆగష్టు 12 : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందని, వారిలో 18,430 మంది చిన్నారులేనని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తుండగా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటని ప్రియాంక గాంధీ తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
అయితే, వీటిని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఖండించారు. గాజాలోని 25 వేల మంది హమాస్ ఉగ్రవాదులనే తాము చంపామని బదులిచ్చారు. ఇజ్రాయెల్ 20లక్షల టన్నుల ఆహార పదార్థాలను గాజాలోకి పంపించిందని, హమాస్ మాత్రం అమాయకపు ప్రజల్ని నిర్బంధించడం కారణంగా వారి ఆకలికి కారణమవుతోందన్నారు. గాజాలో జాతుల మారణహోమం లేదని, గడిచిన 50 ఏళ్లలో అక్కడి జనాభా 450 శాతం పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు
ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు