IRCTC Child ticket Booking: పిల్లలతో రైళ్లో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:08 PM
క్రిస్మస్, సంక్రాంతి సెలవులు దగ్గరపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్స్ జోరందుకుంది. తక్కువ ఖర్చు సహా సురక్షిత మార్గంలో గమ్యస్థానాలకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే.. పిల్లలతో కలిసి రైలు ప్రయాణం చేయదలిచినవారు ఓసారి ఈ విషయం తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: మీరు పిల్లలతో కలిసి రైళ్లో ప్రయాణం చేయాలనుకున్నారా.? అయితే ఇది మీకోసమే.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ముందు.. తల్లిదండ్రులు భారతీయ రైల్వేల పిల్లల టికెట్ విధానం గురించి తెలుసుకోవాలి. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు రైల్వే వ్యవస్థ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అయితే.. వారికి ప్రత్యేక బెర్త్ లేదా సీటు కేటాయింపు వంటివి ఉండవు. ఒకవేళ వారికీ ప్రత్యేకంగా బెర్త్ లేదా సీటు కావాలనుకుంటే మాత్రం జనరల్ ప్యాసింజర్ టికెట్ తీస్కోవాల్సి ఉంటుంది.
2020 మార్చి 6 నుంచి రైల్వే శాఖలో మారిన నిబంధనల ప్రకారం.. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ఇలా ఉచిత ప్రయాణ సౌలభ్యం కల్పిస్తోంది భారతీయ రైల్వే. వీరికోసం తల్లిదండ్రులు ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే.. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలకూ సీటు అవసరాన్ని బట్టి ఛార్జీలు ఆధారపడి ఉంటాయి. సీటు లేదా బెర్తు అవసరం లేనంతవరకూ.. భారతీయ రైల్వే తగ్గించిన పిల్లల ఛార్జీతో ప్రయాణాన్ని అనుమతిస్తుంది. సీటు లేదా బెర్తు అభ్యర్థించినట్లయితే.. సాధారణ ప్రయాణికుల్లా ఛార్జీలు చెల్లించి టికెట్ తీస్కోవాల్సి ఉంటుంది. ఈ విధానం తల్లిదండ్రులకు సౌకర్యవంతంగానూ, బడ్జెట్ ఆధారంగా ప్రయాణం ప్లాన్ చేస్కోవడానికీ ఎంతగానో తోడ్పడనుంది.
ఇవీ చదవండి:
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్