Share News

Maharashtra News : మహాయుతిలో అంతర్యుద్ధం?

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:41 AM

మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. సీఎం ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం షిండే మధ్య దూరం రోజురోజుకి అధికమవుతోంది. షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేల

Maharashtra News : మహాయుతిలో అంతర్యుద్ధం?

షిండే వర్గం ఎమ్మెల్యేల భద్రత కుదింపుతో దుమారం

ముంబై, ఫిబ్రవరి 18 : మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. సీఎం ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం షిండే మధ్య దూరం రోజురోజుకి అధికమవుతోంది. షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేల భద్రతను ఫడణవీస్‌ ఆధ్వర్యంలోని హోం శాఖ కుదించడం కూటమి వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. షిండే వర్గంలోని 20మంది శివసేన ఎమ్మెల్యే(మంత్రివర్గంలో లేని వారు)లకు వైప్లస్‌ క్యాటగిరీ భద్రతను ఒక్క కానిస్టేబుల్‌కు కుదిస్తూ హోం శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. వీరితోపాటు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, అజిత్‌పవార్‌ నేతృత్వంలోని పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేల భద్రతను కూడా కుదించింది. కానీ, వీరితో పోలిస్తే షిండే వర్గంలోని వారి సంఖ్య చాలా ఎక్కువ. భద్రత కుదింపుపై షిండే వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి, రాయ్‌గడ్‌, నాసిక్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జి మంత్రుల నియామకం విషయంలో ఫడణవీస్‌, షిండే మధ్య రేగిన విభేదాలు కొనసాగుతున్నాయి. 2027లో జరగనున్న మహా కుంభమేళా ఏర్పాట్లపై ఫడణవీస్‌ జనవరిలో నిర్వహించిన సమీక్షకు షిండే గైర్హాజరయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కుంభమేళా అంశంపైనేషిండే విడిగా సమీక్ష నిర్వహించారు. ఇటీవల మరో అడుగు ముందుకు వేసిన షిండే.. ముఖ్యమంత్రి సహాయనిధి మాదిరిగా ఉపముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రారంభించి అందరికీ షాకిచ్చారు. ఇక, కొన్నేళ్లుగా మహారాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌ బాధ్యతలను రాష్ట్ర రవాణా మంత్రి నిర్వహిస్తున్నారు. షిండే వర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం రవాణా మంత్రిగా ఉండగా.. చైర్మన్‌ పదవిని ప్రభుత్వం ఇటీవల ఓ ఐఏఎస్‌ అధికారికి అప్పగించింది.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..


Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 04:41 AM