Indian Weapons Cost: యుద్ధం చాలా ఖరీదు
ABN , Publish Date - May 08 , 2025 | 04:52 AM
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ అత్యాధునికమైన ఖరీదైన ఆయుధాలను వినియోగించింది, అంతటి వ్యయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. కానీ పాకిస్థాన్ మాత్రం ఆర్థికంగా బలహీనంగా ఉండి, పూర్తిస్థాయి యుద్ధానికి అవసరమైన నిధులు, వనరులు లేని స్థితిలో ఉంది.
భరించడం పాక్‌కు అసాధ్యం
టెక్నాలజీ పెరగడం వల్ల అనేక అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. తాజాగా ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉపయోగించిన ఆయుధాల్లో అత్యధికం చాలా ఖరీదైనవి. ఉగ్రవాదుల్ని పంపి అమాయక ప్రజలపై దాడులు చేసి చంపుతున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడం కోసం ఎంత వ్యయమైనా భరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ దాడి మరింత పెద్ద యుద్ధానికి దారితీసినా ఎదుర్కోగల అర్థ బలం భారత్‌కు ఉంది. కానీ పాకిస్థాన్ పరిస్థితి అలా కాదు. పాక్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. యుద్ధంలో కీలకమైన 155ఎంఎం షెల్స్ పాక్ వద్ద చాలా తక్కువగా ఉండడంతో టర్కీని బతిమలాడి వాటిని దిగుమతి చేసుకుంది. పాక్‌లో ఇతర మందుగుండుకు కూడా కొరత ఉంది. యుద్ధంలో అత్యంత కీలకమైన చమురు నిల్వలూ సరిపడా లేవు. ఇవన్నీ కొనేందుకు డబ్బు కూడా లేదు. పూర్తిస్థాయి యుద్ధం అంటూ వస్తే అందుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తాజా దాడిలో భారత్ ఉపయోగించిన ఆయుధాల ధరలను ఒక్కసారి పరిశీలిస్తే యుద్ధం ఎంత ఖరీదైనదో అర్థమవుతుంది.
స్కాల్ప్ క్షిపణి ఒక్కోటీ రూ.8.5 కోట్లు
బ్రహ్మోస్ క్షిపణి ఒక్కోటీ రూ.34 కోట్లు
హ్యామర్ బాంబు ఒక్కోటీ రూ.70 లక్షలు
పినాక రాకెట్ ఒక్కోటీ 70 లక్షలు
155 ఎంఎం షెల్ ఒక్కోటీ 33 వేలు
(155 ఎంఎం షెల్స్ ఖరీదు తక్కువ కావడంతో పాక్ ఎక్కువగా వాటితోనే భారత్‌పై దాడులు చేస్తోంది)
- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News