Share News

Train Luggage: రైలు ప్రయాణంలో లగేజ్ తీసుకెళ్తున్నారా? ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి..

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:45 PM

భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలంటే అందరూ రైళ్లనే ఎంచుకుంటారు. తమతో పాటు భారీగా లగేజ్‌ను కూడా తీసుకెళ్తుంటారు. అయితే ఇకపై లగేజ్ విషయంలో భారతీయ రైల్వే నిబంధనలను కఠినతరం చేసింది.

Train Luggage: రైలు ప్రయాణంలో లగేజ్ తీసుకెళ్తున్నారా? ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి..
Luggage In Trains

భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో (Trains) ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలంటే అందరూ రైళ్లనే ఎంచుకుంటారు. తమతో పాటు భారీగా లగేజ్‌ను కూడా తీసుకెళ్తుంటారు. అయితే ఇకపై లగేజ్ విషయంలో భారతీయ రైల్వే (Indian Railway) నిబంధనలను కఠినతరం చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా లగేజీ‌పై పలు ఆంక్షలను విధించింది (Luggage In Trains).


విమానాల్లోలాగానే రైల్వే స్టేషన్లలోనూ ఇకపై బ్యాగేజీ తనిఖీలు తప్పనిసరిగా జరుగుతాయి. అలాగే మీరు ప్రయాణించే తరగతులను బట్టే లగేజీని అనుమతిస్తారు. ఇకపై క్లాసుల వారీగా లగేజీని పరిమితం చేయబోతున్నారు. ఫస్ట్ క్లాస్ ఏసీ భోగీలో ప్రయాణించే ఒక్కో వ్యక్తి తమతో పాటు 70 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే సెకెండ్ ఏసీలో ప్రయాణించే వ్యక్తి 50 కిలోలు, థర్డ్ ఏసీలో ప్రయాణించే వ్యక్తి తనతో పాటు 40 కిలోలు తీసుకెళ్లవచ్చు.


ఇక, స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే వ్యక్తి 40 కిలోలకు మించి లగేజీని తీసుకెళ్లకూడదు. ఇక, జనరల్ భోగీలో ప్రయాణించే వ్యక్తులు కేవలం 35 కిలోల లగేజీని మాత్రమే తనతో తీసుకెళ్లాలి. ఈ పరిమితులు దాటితే అదనంగా చెల్లించాలని రైల్వే అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

For National News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 05:23 PM