Indian Gangsters in USA: అమెరికాలో ఇద్దరు భారతీయ గ్యాంగ్‌స్టర్స్ అరెస్టు
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:55 PM
అమెరికాలో ఉంటూ భారత్‌లో నేరసామ్రాజ్యాన్ని నడిపిస్తున్న భానూ రాణా, వెంకటేశ్ గర్గ్ అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను భద్రతా దళాలు తాజాగా అదుపులోకి తీసుకున్నాయి. త్వరలో వారిని భారత్‌కు తీసుకురానున్నారు. నిందితులపై దేశంలో ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఉంటూ భారత్‌లో నేరసామ్రాజ్యాన్ని ఏలుతున్న ఇద్దరు భారతీయ గ్యాంగ్‌స్టర్స్ పోలీసులకు చిక్కారు. వెంకటేశ్ గర్గ్, భానూ రాణా అనే ఇద్దరు కరుడుగట్టిన గ్యాంగస్టర్‌ను అరెస్టయ్యారు. భారత భద్రతా సంస్థలు, హర్యానా పోలీసులు సంయుక్తంగా పకడ్బందీ ప్లాన్ వేయడంతో నిందితులు దొరికిపోయారు. త్వరలో ఇద్దరినీ భారత్‌కు తరలించనున్నారు (Most Wanted Indian Gangsters Arrested in USA).
హర్యానాలోని నారాయన్‌గఢ్‌కు చెందిన గర్గ్ (Ventakesh Garg) భారత్‌లో పదికిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. హర్యానాతో పాటు రాజస్థాన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో వసూళ్ల దందా నిర్వహించేవాడు. రౌడీషీటర్ల సాయంతో బలవంతపు వసూళ్లకు దిగేవాడు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఓ నేత హత్య కేసులో నిందితుడి ఉన్న అతడు అమెరికాకు పారిపోయాడు. జార్జియాలో అతిడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అమెరికాలోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో కలిసి అతడు భారత్‌లో ఓ క్రిమినల్ గ్యాంగ్‌ను నిర్వహిస్తూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. కొంతకాలం క్రితం సంగ్వాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు ఓ బిల్డర్ ఇంట్లో కాల్పులకు దిగారు. అక్టోబర్‌లో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన భానూ రాణా (Bhanu Rana) కూడా కొంతకాలంగా అమెరికాలో ఉంటూ భారత్‌లో క్రిమినల్ గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం కానా. హర్యానా పంజాబ్, ఢిల్లీలో అతడి క్రిమినల్ కార్యకలాపాలు విస్తరించాయి. ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. పంజాబ్‌లో జరిగిన ఓ గ్రెనేడ్ దాడిలో రాణా పేరు తెరపైకి వచ్చింది. జూన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కర్నాల్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లను అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి హ్యాండ్ గ్రెనేడ్‌లు, పిస్టల్స్, తూటాలు స్వాధీనం చేసుకున్నాయి. వారు రాణాకు చెందిన వారని పోలీసులు వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి