Share News

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:30 AM

ఇంగ్లాండ్ దేశం, భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు.

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ
India UK trade mission

ముంబై, అక్టోబర్ 9: యునైటెడ్ కింగ్‌డమ్(ఇంగ్లాండ్) భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పీఎం అభివర్ణించారు. ఇవాళ ముంబైలో యూకే ప్రధానితో కలిసి మోదీ పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ కీలక ప్రసంగం చేశారు.


జూలైలో రెండు దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అత్యంత ముఖ్యమైనదని బిట్రన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. తాము యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించినప్పటి నుండి మేము కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది అని స్టార్మర్ తెలిపారు. అంతేకాదు, ఇది భారతదేశం ఇప్పటివరకు కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కూడా అని తాను భావిస్తున్నానని బ్రిటన్ ప్రధాని తెలిపారు. కావున ఇది ఇరుదేశాలకు చాలా ముఖ్యమైనదని స్టార్మర్ పేర్కొన్నారు.


కాగా, జూలై 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుకె పర్యటన సందర్భంగా యుకె-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జరిగిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఏటా £25.5 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నారు.

ఇలా ఉండగా, ఈ ఒప్పందం వల్ల భారత్‌తో ఇంగ్లాండ్ వాణిజ్యం చాలా వేగంగా జరిగుతుంది. అంతేకాదు, చౌకైనదిగా కూడా మారనుంది. తద్వారా బ్రిటిష్‌ ప్రజలకు మరిన్ని అవకాశాలు, స్థిరత్వం, ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో వ్యాపారానికి బ్రిటిష్‌ వాణిజ్యవర్గాలకు తలుపులు తెరచుకున్నాయని పేర్కొంది.

బ్రిటిష్‌ ఉత్పత్తులపై భారత్‌ సగటు టారిఫ్‌ 15 శాతం నుంచి మూడు శాతానికి తగ్గనుందని బ్రిటన్ తెలిపింది. దీనివల్ల శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, కార్లు, వైద్య పరికరాలు వంటివి భారత మార్కెట్లో ఇంగ్లాండ్ ఉత్పత్తులు సులభంగా విక్రయించుకోవచ్చని వివరించింది.


ఇవి కూడా చదవండి..

ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..

ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2025 | 11:52 AM