FASTag: ఫాస్ట్‌ట్యాగ్ యుగానికి వీడ్కోలు..మే 1 నుంచి మారనున్న కొత్త విధానం
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:34 PM
దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థ ఇకపై బంద్ కానుంది. GPS ఆధారిత టోల్ వసూళ్ల విధానం (GNSS) ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. దీంతోపాటు టోల్ ప్లాజాల వద్ద రద్దీ సమస్యలు కూడా ఉండవు.
దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఫీజుల వసూళ్ల విధానంలో కీలక మార్పు రానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో, GPS ఆధారిత టోల్ వసూళ్ల విధానం (GNSS) ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి, ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ. ఈ విధానం ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లు జరుగుతాయి.
GNSS ఎలా పనిచేస్తుంది
వాహన స్థానం గుర్తింపు: GPS, GAGAN (GPS Aided Geo Augmented Navigation) సిస్టమ్‌ల ద్వారా వాహనం ఖచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తారు
ప్రయాణ దూరం లెక్కింపు: వాహనం ఎక్కడ ప్రవేశించింది, ఎక్కడ బయటపడిందో తెలుసుకుని, మొత్తం ప్రయాణ దూరాన్ని లెక్కించవచ్చు
టోల్ ఫీజు లెక్కింపు: ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించి, వాహనదారుడు లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ వాలెట్ నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అవుతుంది
FASTagతో పోలిస్తే GNSSలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ సమస్యలు తగ్గుతాయి. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజులు లెక్కించబడతాయి. కాబట్టి తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు న్యాయమైన ఛార్జీలు ఉంటాయి. టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా టోల్ ఫీజులు వసూలు చేయబడతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
GNSS అమలు ప్రణాళిక
ప్రస్తుతం, GNSS వ్యవస్థను పలు జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఉదాహరణకు కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి (NH-275), హర్యానాలోని పానిపట్-హిసార్ జాతీయ రహదారి (NH-709) వంటి మార్గాల్లో GNSS వ్యవస్థను అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మే 1 నుంచి దేశవ్యాప్తంగా GNSS వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పు ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూసే సమయం ఉండదు. దీంతో వాహనదారుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
GNSS ప్రయోజనాలు
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు, రద్దీ సమస్యలకు చెక్
ప్రయాణ సమయంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు
ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజులు లెక్కించబడతాయి. కాబట్టి వాహనదారులకు న్యాయమైన ఛార్జీలు విధిస్తారు
టోల్ వసూళ్లు పారదర్శకంగా జరుగుతాయి. కాబట్టి వాహనదారులు ఎక్కడ, ఎప్పుడు టోల్ చెల్లించారో ఈజీగా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News