AdvaFalciVax Vaccine: త్వరలో స్వదేశీ మలేరియా వ్యాక్సిన్
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:09 AM
మలేరియా రహిత భారత్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రాణాంతక మలేరియాను రూపుమాపడానికి స్వదేశీ
‘అడ్‌ఫాల్సీవ్యాక్స్’ను అభివృద్ధి చేస్తున్న ఐసీఎంఆర్
న్యూఢిల్లీ, జూలై 20: మలేరియా రహిత భారత్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రాణాంతక మలేరియాను రూపుమాపడానికి స్వదేశీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఐసీఎంఆర్, భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం (ఆర్‌ఎంఆర్‌సీబీబీ), జాతీయ మలేరియా పరిశోధన సంస్థ (ఎన్‌ఐఎంఆర్)... నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ-ఎన్‌ఐఐ) భాగస్వామ్యంతో అడ్‌ఫాల్సీవ్యాక్స్ అనే రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. అడ్‌ఫాల్సీవ్యాక్స్ అనేది.. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవిలోని రెండు క్లిష్ట దశలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న స్వదేశీ మలేరియా వ్యాక్సిన్. ఐసీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ దశలో అద్భుత ఫలితాలు అందించిందని, ఇప్పటికే ఉన్న సింగిల్ స్టేజ్ వ్యాక్సిన్ల కంటే అడ్‌ఫాల్సీవ్యాక్స్‌తో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని డేటా వెల్లడిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News