Share News

Anuparna Roy : వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకురాలిగా అనుపర్ణరాయ్

ABN , Publish Date - Sep 07 , 2025 | 09:26 AM

భారతీయ యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ చరిత్ర సృష్టించారు. వెనీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 82వ ఎడిషన్‌లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు పొందారు. ఆమె సినిమా 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కు ఈ అవార్డు దక్కింది.

Anuparna Roy :  వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకురాలిగా అనుపర్ణరాయ్
Anuparna Roy Songs of Forgotten Trees

వెనిస్ (ఇటలీ), సెప్టెంబర్ 7 : భారతీయ యువ దర్శకురాలు అనుపర్ణ రాయ్ చరిత్ర సృష్టించారు. వెనీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 82వ ఎడిషన్‌లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు పొందారు. ఆమె సినిమా 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కు ఈ అవార్డు దక్కింది. ఓరిజాంటి పోటీలో అనుపర్ణ బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును ఓరిజాంటి జ్యూరీ అధ్యక్షురాలిగా ఉన్న ఫ్రెంచ్ డైరెక్టర్ జూలియా డుకోర్నావు.. అనుపర్ణకు అవార్డు ప్రదానం చేశారు.

Anuparna-Roy.jpg


ముంబైలో ఇద్దరు వలస మహిళల జీవితాలను చిత్రిస్తూ తీసిన సినిమా 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'. ఒంటరితనం, జీవనోపాధి, క్షణిక సంబంధాల థీమ్‌లతో ఈ సినిమా రూపొందిచారు అనుపర్ణ. ఓరిజాంటి విభాగంలో భారత్ నుంచి ఈ సినిమా మాత్రమే పాల్గొనడం విశేషం. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చరిత్రాత్మక విజయం భారతీయ సినిమాను అంతర్జాతీయంగా మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.


అవార్డు స్వీకరణ సమయంలో తెల్లటి శారీలో కనిపించిన అనుపర్ణ రాయ్, 'ఈ క్షణం స్వప్నంలా ఉంది' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. జ్యూరీ, నిర్మాతలు, కళాకారులు, అనురాగ్ కశ్యప్‌లకు ధన్యవాదాలు చెప్పారు. ఇది భారతీయ సినిమా, గ్లోబల్ స్టేజ్‌పై కొత్త మైలురాయిని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిందని అనుపర్ణ అన్నారు.


ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇతర ముఖ్య అవార్డులు:

  • 'గోల్డెన్ లయన్‌'ను జిమ్ జార్మస్క్ చిత్రం 'ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్'కు లభించింది.

  • 'సిల్వర్ లయన్ గ్రాండ్ జ్యూరీ' ప్రైజ్‌ను 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' గెల్చుకుంది.

  • బెస్ట్ డైరెక్టర్ అవార్డుతో అనుపర్ణరాయ్ భారతీయ చిత్రరంగానికి గర్వకారణమయ్యారు.


ఇవి కూడా చదవండి

మహీంద్రా తగ్గింపు తక్షణమే

కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా

Updated Date - Sep 07 , 2025 | 10:46 AM