Share News

RGI: జనగణనకు 14 వేల కోట్లు ఇవ్వండి: ఆర్జీఐ

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:49 AM

దేశంలో చేపట్టనున్న జనగణన కోసం రూ.14,618.95 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్జీఐ) ప్రతిపాదించింది.

RGI: జనగణనకు 14 వేల కోట్లు ఇవ్వండి: ఆర్జీఐ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: దేశంలో చేపట్టనున్న జనగణన కోసం రూ.14,618.95 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్జీఐ) ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేసింది. రెండు దశల్లో చేపట్టే జనాభా లెక్కింపునకు 35 లక్షల మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం ఉందని పేర్కొంది. వీరికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రక్రియ మొత్తం డిజిటల్‌గానే సాగనుందని వివరించింది. ప్రతిపాదిత మొత్తాన్ని రెండు దశల లెక్కింపునకు వినియోగించనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు తొలిదశ, 2027, ఫిబ్రవరి నుంచి రెండో దశ లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించింది.


మెడిసిన్‌ ట్యూబ్‌లతో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు

ముంబై, సెప్టెంబరు 1: ఆస్పత్రుల్లో చికిత్స సమయంలో మందులు సరఫరా చేయడానికి, ద్రవపదార్థాలను శరీరంలోకి పంపడానికి ఉపయోగించే ట్యూబ్‌ల నిర్వహణ సరైన పద్ధతిలో చేపట్టకపోవడం వల్ల రోగులు అనేక రకాల బ్లడ్‌ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని తాజా అధ్యయనంలో గుర్తించారు. దేశవ్యాప్తంగా 54 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, 200కిపైగా ఐసీయూల్లో ఏడేళ్లపాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో మెడిసిన్‌ ట్యూబ్‌ల నిర్వహణలోపం కారణంగా 8,600కిపైగా కేసుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్లను గుర్తించారు. సెంట్రల్‌ లైన్‌ ఇన్ఫెక్షన్లుగా పేర్కొంటున్న వీటివల్ల ముఖ్యంగా నవజాత శిశువులు అధికంగా ప్రభావితమైనట్టు కనుగొన్నారు. ఇన్ఫెక్షన్ల బారినపడిన రోగుల్లో దాదాపు 40 శాతం మంది రెండు వారాల్లోనే చనిపోయారని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రతి వెయ్యి సెంట్రల్‌ లైన్‌ రోజులకు దాదాపు 9 సెంట్రల్‌ లైన్‌ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని తెలిపింది. ఈ అధ్యయనం వివరాలు ఇటీవల లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


ఇవి కూడా చదవండి..

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్

ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 01:49 AM