Share News

India: పాక్ హైకమిషన్ అధికారికి అల్టిమేటం.. 24 గంటల్లో దేశం విడిచి పెట్టాలని భారత్ ఆదేశం

ABN , Publish Date - May 13 , 2025 | 09:46 PM

పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ అధికారిని భారత్ మంగళవారం నాడు 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించింది. ఆయనను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

India: పాక్ హైకమిషన్ అధికారికి అల్టిమేటం.. 24 గంటల్లో దేశం విడిచి పెట్టాలని భారత్ ఆదేశం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ అధికారిని భారత్ మంగళవారం నాడు 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించింది. ఆయనను దేశం నుంచి బహిష్కరించింది. 24 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని హుకుం జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఒక దేశం మరొక దేశ దౌత్యవేత్తపై తీసుకోదగిన తీవ్రమైన చర్యగా "పర్సోనా నాన్ గ్రాటా''ను చెప్పవచ్చు. ఆతిథ్య దేశం ఏ సమయంలోనైనా ఎలాంటి వివరణ లేకుండా దౌత్య సిబ్బందికి చెందిన వ్యక్తిని నాన్ గ్రేటాగా ప్రకటించవచ్చు.

Randhir Jaiswal: బంగ్లాలో అవామీలీగ్ పార్టీ నిషేధంపై భారత్ ఆందోళన


''న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి.. ఇండియాలోని అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నందున ఆయనను పర్సోనా నాన్ గ్రేటాగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా అతన్ని ఆదేశించింది" అని ఎంఈఏ ఆ ప్రకటనలో తెలిపింది.


భారత్-పాక్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర మిలటరీ ఉద్రిక్తతలు కొనసాగిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. హైకమిషన్ అధికారి ప్రవర్తనపై పాక్ ఛార్జ్ డిఎఫైర్స్‌కు భారత్ లాంఛనంగా సమాచారం తెలియజేసింది.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Updated Date - May 13 , 2025 | 10:04 PM