Share News

Naval Exercise : అరేబియా సముద్రంలో రేపు, ఎల్లుండి భారత్, పాక్ నావికా విన్యాసాలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 09:47 PM

ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య రేపు, ఎల్లుండి(ఆగష్టు 11, 12 తేదీల్లో) ఆరేబియా సముద్రంలో నావికాదళ విన్యాసాలు జరుగనున్నాయి. దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాలు తమ శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శిస్తుండటం విశ్లేషకులలో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

Naval Exercise : అరేబియా సముద్రంలో రేపు, ఎల్లుండి భారత్, పాక్ నావికా విన్యాసాలు
Naval Exercise

న్యూఢిల్లీ, ఆగష్టు 10 : ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారతదేశ తదుపరి ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య నావెల్ ఎక్సర్‌సైజెస్ జరుగనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య రేపు, ఎల్లుండి(ఆగష్టు 11, 12 తేదీల్లో) ఆరేబియా సముద్రంలో ఈ విన్యాసాలు జరుగనున్నాయి. ఈ విన్యాసాల్ని ఇరు దేశాల రక్షణ వర్గాలు ధృవీకరించాయి.

Indian-navy.jpgజారీ చేసిన నోటీసు టు ఎయిర్‌మెన్ (NOTAM) ప్రకారం, భారత నావికాదళం గుజరాత్‌లోని పోర్‌బందర్, ఓఖా తీరాల వెలుపల విన్యాసాలు నిర్వహిస్తుంది. పాకిస్తాన్ నావికాదళం అదే తేదీలలో దాని ప్రాదేశిక జలాల్లో విన్యాసాల్ని నిర్వహించనుంది. అయితే ఇరు దేశాల నావికా విన్యాసాలు దగ్గరగా ఉండటం, దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాలు తమ శక్తిసామర్థ్యాల్ని ప్రదర్శిస్తుండటం విశ్లేషకులలో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.


ఈ విన్యాసాలు అరేబియా సముద్రంలో ఇరుదేశాల నావికా కార్యకలాపాలు, వ్యూహాత్మక ఎత్తుగడలకు కీలకమైన భూమిక పోషిస్తాయి. ఇది భారత, పాకిస్తాన్ సముద్ర భద్రతా ప్రయోజనాలకు కీలకమైన ప్రాంతం. భారత నావికాదళ విన్యాసాలలో యుద్ధనౌకలు, యుద్ధ విమానాలతో కూడిన ప్రత్యక్ష విన్యాసాలు ఉండబోతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ విన్యాసాలు తమ సంసిద్ధతను సమాంతరంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ విన్యాసాలు ప్రామాణిక కార్యాచరణ శిక్షణలో భాగమని రెండు నావికాదళాలు చెబుతున్నాయి.

Indian-navy-4.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2025 | 09:47 PM