Teacher Caught Cheating: అద్దె ఇంట్లో ప్రియుడితో భార్య.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భర్త.. తరువాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:10 PM
ఆమె ఒక టీచర్.. తన విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ, భవిష్యత్ పౌరులను సరైన మార్గంలో పయనింపజేయాల్సిన టీచరమ్మే.. వక్రమార్గం పట్టింది.
భువనేశ్వర్, సెప్టెంబర్ 11: ఆమె ఒక టీచర్.. తన విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ, భవిష్యత్ పౌరులను సరైన మార్గంలో పయనింపజేయాల్సిన టీచరమ్మే.. వక్రమార్గం పట్టింది. ఫలితంగా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఇంతకీ ఆ టీచర్ ఏం చేసింది.. ఎందుకు అంత పెద్ద శిక్ష విధించారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒడిశాలోని పూరి జిల్లాకు చెందిన ఓ టీచర్‌ను ఆమె భర్త చెప్పుల దండ వేసి వీధుల వెంట ఊరేగించాడు. ఆమె చేసిన తప్పు కారణంగానే తాను అలా చేశానని సదరు భర్త చెబుతున్నాడు. ఈ ఘటనకు తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అదికాస్తా సెన్సేషనల్‌గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూరీకి చెందిన ఓ మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు ఉండటంతో.. ఆమె భర్త నుంచి వేరుగా ఉంటోంది. నిమపడ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే.. సదరు టీచర్ తన సహచర ఉపాధ్యాయుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఇది తెలిసిన భర్త.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన బంధుమిత్రులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమెతో పాటు ఆమె ప్రియుడు కూడా ఉన్నారు. వీరిద్దరూ అసభ్యకరమైన స్థితిలో ఉండటాన్ని గమనించిన భర్త.. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరినీ మెడపట్టుకుని ఇంటి బయటకు లాక్కొచ్చాడు. జనం అంతా చూస్తుండగా వారిని విపరీతంగా కొట్టాడు. ఆ తరువాత ఇద్దరి మెడలో చెప్పుల దండను వేసి వీధుల్లో తిప్పాడు. భార్య ప్రియుడి బట్టలు ఊడదీసి కొట్టారు. ఈ పరిణామాన్ని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళా టీచర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన కారణంగా ఆమె భర్తను, మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.
Also Read:
Rahul Gandhi CRPF: రాహుల్ గాంధీ భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదు..
Who is Kulman Ghising: ఇంతకీ ఎవరీ కుల్మన్ ఘీసింగ్..
For More National News and Telugu News..