Mohan Bhagwat: నేను రిటైర్ కాను.. రిటైర్ కావాలని ఎవరికీ చెప్పలేదు
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:05 AM
రిటైర్మెంట్‌కు సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరెస్సెస్ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...
బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాల్లేవ్
సంఘ్ సలహాలిస్తుంది, ప్రభుత్వాన్ని నడపదు రిజర్వేషన్లకు పూర్తి సమర్థన
చొరబాట్లు, బలవంతపు మతమార్పిళ్లు ఆపాలి
ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భాగవత్
న్యూఢిల్లీ, ఆగస్టు 28: రిటైర్మెంట్‌కు సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల వయసులో తాను రిటైర్ అవుతానని కానీ లేదా ఇంకెవరినైనా రిటైర్ కావాలని కాని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సంఘ్ కోరుకున్నంత కాలం పనిచేయాల్సిందేనని, అప్పజెప్పిన పని చేస్తూ ఉండాల్సిందేనన్నారు. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలో మీడియాతో గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూలై 9న నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిటైర్‌మెంట్‌కు సంబంధించి మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. 75ఏళ్ల వయసు వచ్చిన వారికి శాలువా కప్పుతున్నారంటే మీరు తప్పుకుని మరొకరికి అవకాశం ఇవ్వండని అర్థమని చెప్పారు. అయితే సంఘ్ సీనియర్ నేత మోరోపంత్ పింగ్లే గతంలో చేసిన వ్యాఖ్యలను తాను ఉదహరించానని భాగవత్ స్పష్టం చేశారు. నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని మీడియాలో కథనాలు రావడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలోనే భాగవత్ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీతో సంఘర్షణ ఉండొచ్చని, తగాదాలు మాత్రం లేవని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. సంఘ్ సలహాలు మాత్రమే ఇస్తుందని, ప్రభుత్వాన్ని నడపదని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. బలవంతపు మతమార్పిళ్లు ఆగాలన్నారు. రిజర్వేషన్లకు సంఘ్ పూర్తి మద్దతునిస్తుందని, రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..