Sudha Murthy: ఎక్కువ భాషలు రావడం మంచిదే.. నాకు ఎన్ని వచ్చంటే?
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:14 PM
త్రిభాషా విధానానికి రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి మద్దతు పలికారు. ఇందువల్ల విద్యార్థులు మరిన్ని భాషలు నేర్చుకోగలుగుతారని అన్నారు. తాను కూడా పలు భాషలు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందానని చెప్పారు.

న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NED)లో భాగంగా త్రిభాషా సూత్రం అమలును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రిభాషా విధానానికి రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి (Sudha Murthy) మద్దతు పలికారు. ఇందువల్ల విద్యార్థులు మరిన్ని భాషలు నేర్చుకోగలుగుతారని అన్నారు.
Yogi Adityanath: ఇస్లాం పుట్టక ముందే సంభాల్ ఉంది
వివిధ భాషలు నేర్చుకోవడంపై తన అనుభవాన్ని సుధా మూర్తి వివరిస్తూ, ప్రతి ఒక్కరూ అనేక భాషలు నేర్చుకావాలన్నది తన అభిప్రాయమని, తనకు 7-8 భాషలు వచ్చనీ చెప్పారు. నేర్చుకోవడానికి తాను ఇష్టపడతానని, పిల్లలు కూడా దీని వల్ల ప్రయోజనాలు పొందుతారని అన్నారు.
త్రిభాషా విధానాన్ని డీఎంకే వ్యతిరేకిస్తుండగా, తమిళనాడులో డీఎంకే మిత్రపక్షపైన కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ త్రిభాషా విధానాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వం ఇంగ్లీషు, తమిళంతో ద్విభాషా విధానానికి కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ శాస్త్ర, సాంకేతక, వాణిజ్య విధానాలతో అనుసంధానం కోసం ఆంగ్లం, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు తమిళం అమలు చేస్తోందని, ఎవరైనా మూడో భాష నేర్చుకోవాలంటే ఐచ్ఛికంగా ఉండాలే కానీ, తప్పనిసరి చేయరాదని అన్నారు. కాంగ్రెస్ మరో ఎంపీ జెబి మాథర్ మాట్లాడుతూ, భాష అనేది చాలా సున్నితమైన, భావోద్యేగాలకు సంబంధించిన అంశమని బీజేపీ గ్రహించాలన్నారు. ప్రజల మనోభావాలకు భిన్నమైన ఏ అంశాన్ని ప్రమోట్ చేయారాదన్నారు. సమాజంలో విభజనలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రోత్సహిస్తారని ఆరోపించారు. దీనిపై విపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, బీజేపీకి ఎన్‌ఈపీ విషయంలో రహస్య ఎజెండా ఉందని అన్నారు. కాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు డీఎంకే వైఖరిని తప్పుపట్టారు. స్టాలిన్ ప్రభుత్వం తమిళనాట రాజకీయ గందరగోళం సృష్టిస్తోందని, నేర్చుకునే హక్కును పిల్లలకు లేకుండా చేస్తోందని అన్నారు.
ఇవి కూడా చదవండి...
Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..
Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.