Share News

Mohan Bhagwat: ఆక్రమించింది వెనక్కి తీసుకోవాలి... మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 05 , 2025 | 07:45 PM

భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని మోహన్ భగవత్ అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, మనది అవిభక్త భారతదేశమని గుర్తుంచుకోవాలని అన్నారు.

Mohan Bhagwat: ఆక్రమించింది వెనక్కి తీసుకోవాలి... మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Mohan Bhagwat on PoK

న్యూఢిల్లీ: పాకిస్తాన్ పాలకుల అణచివేతపై పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో ప్రజలు తిరగబడటం, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, మనది అవిభక్త భారతదేశమని గుర్తుంచుకోవాలని అన్నారు. మధ్యప్రదేశ్‌ సాత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవంలో మోహన్ భగవత్ ఆదివారం నాడు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. మనని మనం భిన్నంగా పిలుచుకుంటున్నప్పటికీ మనమంతా ఒకటేనని, మనమంతా హిందువులమేనని అన్నారు. 'చాలా మంది సింధీ సోదరులు ఇక్కడున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు పాకిస్తాన్ వెళ్లలేదు. వాళ్లు అవిభక్త భారతదేశానికి వెళ్లారు. పరిస్థితులు మనల్ని ఇక్కడి నుంచి ఆ ఇంటికి పంపాయి. ఎందుకంటే ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరుకావు. ఇండియా మొత్తం ఒకే ఇల్లు. నా ఇంట్లో టేబులు, కుర్చీ, బట్టలు ఉంచుకునే గదిని ఒకరు తొలగించారు. దాన్ని ఆక్రమించుకున్నారు. రేపు, వాటిని నేను వెనక్కి తీసుకోవాలి' అని మోహన్ భగవత్ అన్నప్పుడు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.


ఇవి కూడా చదవండి..

ఈవీఎంలపై పెద్దగా సీరియల్ నెంబర్లు, కలర్ ఫోటోలు.. సీఈసీ వెల్లడి

లెహ్ నిరసనకారుల మృతిపై న్యాయవిచారణకు వాంగ్‌చుక్ డిమాండ్

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2025 | 08:29 PM