Share News

ORS Label Ban: ‘ORS’ లేబుల్ నిషేధం..ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం

ABN , Publish Date - Oct 18 , 2025 | 09:09 PM

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ శివరంజని పిల్లల వైద్యురాలు. ప్రస్తుతం ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లు అన్ని నిజమైన ఓఆర్ఎస్‌లు కావని 2017లో ఆమె గుర్తించారు. అప్పటి నుంచి ఓఆర్ఎస్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆమె వాదిస్తూ వచ్చింది. చివరకు విజయం సాధించింది.

ORS Label Ban: ‘ORS’ లేబుల్ నిషేధం..ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం
ORS

చాలా మంది తమ కుటుంబం కోసం పోరాటం చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం సమాజం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పోరాటాలు చేసి..అందులో విజయం సాధిస్తారు. తాజాగా హైదారాబాద్ కు చెందిన వైద్యురాలు 8 ఏళ్లు చేసిన పోరాటం అంతిమంగా ఫలించింది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కంపెనీలపై ఆమె ఏళ్ల తరబడి పోరాడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యం దెబ్బతీసే విధంగా ORS లేబుల్స్ ఉన్నాయని, వాటిని నిషేధించాలని ఆమె పట్టుబట్టింది. చివరకు విజయం సాధించింది. ఇంతకీ ఆ వైద్యురాలు ఎవరు? ఆ స్టోరీ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..


హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ శివరంజని పిల్లల వైద్యురాలు. ప్రస్తుతం ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లు అన్ని నిజమైన ఓఆర్ఎస్‌లు కావని 2017లో ఆమె గుర్తించారు. అప్పటి నుంచి ఓఆర్ఎస్ ఉత్పత్తులను నిషేధించాలని ఆమె వాదిస్తూ వచ్చింది. సాధారణంగా శరీరంలో సోడియం, షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండేందుకు ‘ఓఆర్ఎస్’(ORS labeling Rules) తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన ప్రకారం సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ డైహైడ్రేట్ వంటి ఉన్న పానీయం అసలైన ఓఆర్ఎస్‌(ORS brands India). ఇందులో గ్లూకోజ్ స్థాయి కీలకంగా ఉంటుంది. వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. కొన్ని నకిలీ ఓఆర్ఎస్‌లలో గ్లూకోజు స్థాయి వంద మిల్లీ లీటర్ల ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు ఉంటుంది. షుగర్ లెవెల్స్ సైతం ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే సమయంలో మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లు తక్కువస్థాయిలో ఉంటాయి. దీంతో వాటి లేబుల్స్‌ని రద్దు చేయాలని శివరంజిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది.


తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్‌ఎస్‌ పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSI) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కూల్‌డ్రింక్స్‌ రూపంలో ఉన్న టెట్రాప్యాక్‌లపై ఓఆర్‌ఎస్, ఓఆర్‌ఎస్‌ఎల్‌(ORSL) అనే పదాలను ముద్రించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ డ్రింక్స్‌లో షుగర్‌ ఎక్కువగా ఉండటంతో విరేచనాలు,అతిసార ఇంకా పెరుగుతాయి. ఓఆర్ఎస్ అని చాలా కంపెనీలు తమ టెట్రాప్యాక్‌లపై ముద్రించి, అమ్మడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ FSSI ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎఫ్ఎస్ఎస్ఐ( FSSAI 2025) నిర్ణయంతో శివరంజని(Shivaranjani)పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి


Also Read:

శనిదేవుడిని పూజించేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి

కార్తీక మాసంలో దీపాలను ఎందుకు దానం చేయాలి? దాని ప్రాముఖ్యత తెలుసుకోండి

Updated Date - Oct 18 , 2025 | 09:09 PM