Share News

Chennai: వాటికి తెలియదుగా.. అది కలెక్టర్ వాహనం అని..

ABN , Publish Date - May 08 , 2025 | 01:44 PM

కలెక్టర్‌ కారును గుర్రాలు ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఊటీ నగరంలోని ప్రధాన రహదారులైన పింకర్‌ పోస్ట్‌, బర్న్‌హిల్‌, బొటానికల్‌ గార్డెన్‌, బస్టాండ్‌, కమర్షియల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో గుర్రాలు అధిక సంఖ్యలో సంచరిస్తుంటాయి. అయితే.. అక్కడ నిలిని వాహనాన్ని అవి ఢీకొనడంతో అది ధ్వంసమైంది.

Chennai: వాటికి తెలియదుగా.. అది కలెక్టర్ వాహనం అని..

- కలెక్టర్‌ కారును ధ్వంసం చేసిన గుర్రాలు..

చెన్నై: జిల్లా కలెక్టర్‌ కారును ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. నీలగిరి జిల్లా ఊటీ నగరంలోని ప్రధాన రహదారులైన పింకర్‌ పోస్ట్‌, బర్న్‌హిల్‌, బొటానికల్‌ గార్డెన్‌, బస్టాండ్‌, కమర్షియల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో గుర్రాలు అధిక సంఖ్యలో సంచరిస్తుంటాయి. రోడ్లపై గుర్రాల సంచారంతో పాదచారులు, వాహన చోదకులు భయంతో వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: సీఎం స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు.. మా ఓటమి కోసం వారు తపిస్తున్నారు..


ఈ నేపథ్యంలో, బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ లక్ష్మి భవ్య బర్న్‌హిల్‌ ప్రాంతంలో కారు పార్కింగ్ చేసి వెళ్లారు. ఆ సమయంలో అటుగా వచ్చిన గుర్రాల మంద కలెక్టర్‌ వాహనాన్ని ఢీకొనడంతో, వాహన అద్దాలు పగిలిపోయాయి. అనంతరం మరో కారులో కలెక్టర్‌ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ ఫిర్యాదుపై ఊటీ జీ1 పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశీలన్‌, ఇద్దరిపై కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత

Operation Sindoor: సిందూరమే.. సంహారమై

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2025 | 01:44 PM