Share News

Dy CM, Home Minister: హోంమంత్రి x డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:45 PM

దశాబ్దకాలంలో బెంగళూరు(Benggaluru)కు అనుబంధంగా దేవనహళ్ళిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విశ్వవ్యాప్తంగా పేరొందింది. కొవిడ్‌ తర్వాత గణనీయంగా ప్రయాణీకుల సంఖ్య పెరిగింది.

Dy CM, Home Minister: హోంమంత్రి x డిప్యూటీ సీఎం

- రెండో ఎయిర్‌పోర్ట్‌ కోసం పోటాపోటీ

- తుమకూరుకు తీసుకెళ్లే ఆలోచనలో హోంమంత్రి పరమేశ్వర్‌

- మాగడివైపు సర్వే చేయించిన డీకే

బెంగళూరు: దశాబ్దకాలంలో బెంగళూరు(Benggaluru)కు అనుబంధంగా దేవనహళ్ళిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విశ్వవ్యాప్తంగా పేరొందింది. కొవిడ్‌ తర్వాత గణనీయంగా ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. దీనికితోడు సరుకు రవాణాలోనూ విశేష ప్రగతి సాధించింది. రానున్న పదేళ్లలో విమానాశ్రయానికి అన్ని విధాలా ఒత్తిడి పెరగనుందని బెంగళూరుకు అనుబంధంగా మరో చోట్ల అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం విమానాశ్రయానికి ఉండే ఒప్పందం పదేళ్లలో ముగియనుంది.

ఈ వార్తను కూడా చదవండి: పడిపోయిన క్యాబేజీ ధర.. కిలో రూ.2 మాత్రమే


ఈలోగా రెండో విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ మహత్తరమైన ఆలోచనగా ఉంది. రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ ఐదు నెలలక్రిందట చేసిన ప్రస్తావన అంచెలంచెలుగా పాకి భూమి సర్వేలదాకా వెళ్లింది. అయితే రెండో విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం ఇద్దరు కీలకనేతలమధ్య పోటీకి కారణమవుతోంది. బెంగళూరుకు అనుబంధంగా ఎయిర్‌పోర్ట్‌ ఉంటే మినహా అభివృద్ధి సాధ్యం కాదని అన్ని వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. రెండో విమానాశ్రయం బెంగళూరులో కాకుండా వెనుకబడిన కల్యాణ కర్ణాటక(Karnataka) జిల్లాల్లో ఏర్పాటు చేయడం సముచితమని అభిప్రాయాలు వచ్చాయి. అయితే బెంగళూరులో ఉన్నంత అనుకూలం, ఐటీ, బీటీ, రక్షణారంగం, వైమానిక రంగం, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు వందలకొలదీ ఎంఎన్‌సీ కంపెనీలు ఉన్నందునే ఉన్న విమానాశ్రయానికి రద్దీ ఉందని తేల్చేశారు. దీన్నిబట్టి బెంగళూరుకు అనుబంధంగానే విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది స్పష్టమైంది.


భూముల ధరలకు రెక్కలు

డీసీఎం, హోం మంత్రులు తమ నియోజకవర్గాల పరిధిలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లు గద్దల్లా వాలిపోయారు. ఎయిర్‌పోర్ట్‌ ఎక్కడ ఏర్పాటు అవుతుందో తెలియదుగానీ రెండు నియోజకవర్గాల పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ జోరుగా సాగుతోంది. రెండు నెలలుగా సర్వేలు, మంత్రుల అభిప్రాయాలు మలుపులు తిరిగినట్లుగానే రియల్‌ వ్యాపారాలు కూడా తిరుగుతున్నాయి. బెంగళూరులో రెండో ఎయిర్‌పోర్ట్‌ విషయమై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహననాయుడు సానుకూలంగా స్పందించారు. ఇటీవలే లోక్‌సభలో మంత్రి మాట్లాడుతూ బెంగళూరు పరిధిలో భూమి సిద్ధం చేస్తే విమానాశ్రయం ఏర్పాటుకు తాము అనుకూలమని ప్రకటించారు. దీంతో ఆశలు మరింత పెరిగాయి. కానీ మాగడి, నెలమంగల ప్రాంతాల్లో ఇటీవల భూముల సర్వేకు అధికారులు వెళ్లినప్పుడు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో డ్రోన్‌ల ద్వారా సర్వేలు చేశారు.


తుమకూరుకే పరమేశ్వర్‌ మొగ్గు

21 జిల్లాలకు అనుబంధమైన చోటునే విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఇది తుమకూరు ప్రాంతంలో సముచితమని హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) స్పష్టం చేశారు. బెంగళూరు వీడితే తుమకూరు, చిత్రదుర్గ నుంచి ఉత్తర కర్ణాటక జిల్లాల అన్నింటికీ జాతీయ రహదారికి అనుబంధంగా ఉండే తుమకూరు ప్రాంతంలో విమానాశ్రయం మంచిదన్నారు. అయితే విమానాశ్రయం తన నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు కావాలనే ఆశ ఉందని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) ప్రస్తావన తెచ్చారు. నెలమంగల - సోలూరుల పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి ఉందన్నారు. ఫ్లైయింగ్‌ జోన్‌కు కనీసం 4,400 ఎకరాల భూమి అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

pandu1.2.jpg


హోసూరులో ఏర్పాటుకు తమిళనాడు యత్నాలు

కాగా బెంగళూరు నగరానికి సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం హోసూరులో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. బెంగళూరు నుంచి మెట్రో సేవలు హోసూరు దాకా విస్తరింపచేసి విమానాశ్రయం ఏర్పాటు చేయించాలని తమిళనాడు భావించింది. రెండు రాష్ట్రాలమధ్య మెట్రో సేవలు అనుసంధానం చేసినట్లు అవుతుందని ప్రతిపాదనలు పెట్టారు. బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (బీఎంఆర్‌సీఎల్‌), చెన్నై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌లు మధ్య చర్చలు కూడా జరిగాయి కానీ ఫలించలేదు. తాజాగా విమానాశ్రయం ఏర్పాటు విషయమై తమిళనాడుకు చెందిన ఎంపీలు, కేంద్ర విమానయానశాఖ మంత్రితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.


అయితే హోసూరులో విమానాశ్రయానికి పలు అభ్యంతరాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఇది తమిళనాడుకు షాక్‌ ఇచ్చేలా మారినట్టు తెలుస్తోంది. అదే నిర్ణయం కొనసాగితే బెంగళూరులో రెండో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు మరింత సుగమం చేసినట్లు అవుతుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం అంతటితో నిరుత్సాహం చెందకుండా ప్రయత్నాలను కొనసాగిస్తోంది. రెండు స్థలాలను ఎంపిక చేసి వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి, విమానయానశాఖ మంత్రిత్వశాఖకు పంపించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట

ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2025 | 01:45 PM