పడిపోయిన క్యాబేజీ ధర.. కిలో రూ.2 మాత్రమే
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:00 PM
క్యాబేజీ కిలో రూ.2కు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్(Eeroad) జిల్లా తాళవాడి కొండ గ్రామాల్లో రైతులు సుమారు మూడువేల ఎకరాల్లో క్యాబేజీ సాగుచేస్తున్నారు.

చెన్నై: క్యాబేజీ కిలో రూ.2కు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్(Eeroad) జిల్లా తాళవాడి కొండ గ్రామాల్లో రైతులు సుమారు మూడువేల ఎకరాల్లో క్యాబేజీ సాగుచేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.80 వేల వరకు రైతులు ఖర్చు పెడుతున్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది దిగుబడి పెరిగింది. ఈ నేపథ్యంలో, కొద్ది రోజులుగా క్యాబేజీ కిలో రూ.10 నుంచి రూ.20 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.2కు పడిపోయింది. ఈ ధరకు ఇస్తే కూలీల ఖర్చు కూడా రాదని, అలాగని పంట విక్రయించకపోతే పూర్తిగా దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల నుంచి క్యాబేజీ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Training: తాబేళ్ల కళేబరాల పోస్టుమార్టంపై వెటర్నరీ వైద్యులకు శిక్షణ
ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News