Share News

Training: తాబేళ్ల కళేబరాల పోస్టుమార్టంపై వెటర్నరీ వైద్యులకు శిక్షణ

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:37 PM

మృతిచెందిన తాబేళ్లకు పోస్టుమార్టం నిర్వహించడంపై వెటర్నరీ వైద్యులకు(Veterinary doctors) అటవీశాఖ నిపుణులు శిక్షణ ఇచ్చారు. సముద్రం నుంచి తాబేళ్లు తీరానికి చేరుకొని ఇసుకలో గుంతలు తవ్వి గుడ్లు పెట్టి వెళుతుంటాయి.

Training: తాబేళ్ల కళేబరాల పోస్టుమార్టంపై వెటర్నరీ వైద్యులకు శిక్షణ

చెన్నై: మృతిచెందిన తాబేళ్లకు పోస్టుమార్టం నిర్వహించడంపై వెటర్నరీ వైద్యులకు(Veterinary doctors) అటవీశాఖ నిపుణులు శిక్షణ ఇచ్చారు. సముద్రం నుంచి తాబేళ్లు తీరానికి చేరుకొని ఇసుకలో గుంతలు తవ్వి గుడ్లు పెట్టి వెళుతుంటాయి. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా సుమారు వెయ్యికి పైగా తాబేళ్లు మృతిచెంది తీరానికి కొట్టుకొచ్చాయి. తాబేళ్ల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించిన అటవీ శాఖ అధికారులు, వాటిని తీరంలోనే పూడ్చిపెడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Premalatha: వర్సిటీ అత్యాచారం కేసులో.. ‘ఆ సార్‌’ ఎవరో తేల్చండి


ఈ నేపథ్యంలో వండలూరు జూ పార్క్‌(Zoo Park)లో గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించడంపై వెటర్నరీ వైద్యులకు శిక్షణ ఇచ్చారు. గాయపడిన తాబేళ్లకు చికిత్స, మృతిచెందిన వాటికి పోస్టుమార్టం నిర్వహించడం తదితరాలపై శిక్షణలో వివరించడంతో పాటు ప్రాక్టికల్‌గా చేసి చూపారు. ఈ శిక్షణలో సుమారు 25 మందికి పైగా వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట

ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2025 | 12:37 PM