Share News

Holi Special Trains: పండుగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 02:05 PM

హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త తెలిపింది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఏ ఏ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Holi Special Trains: పండుగ వేళ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రంగులు జల్లుకుంటూ ఎంతో సంతోషంగా దీనిని జరుపుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీని వల్ల సులభంగా ట్రైన్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏ ఏ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


స్పెషల్ ట్రైన్స్ వివరాలు ఇవే..

హనుమకొండ జిల్లాలోని కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కాజీపేట మీదుగా ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నారు. 07707 నెంబర్ తో గల రైలు ఈ నెల 6, 12, 16వ తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 8.45 గంటలకు బయలుదేరి నిజాముద్దీన్‌కు 8,14,18వ తేదీల్లో తెల్లవారుజామున 1. 30 గంటలకు చేరుకుంటుందని ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 14, 18వ తేదీల్లో 07708 నెంబర్ గల రైలు హాజరత్ నిజాముద్దీన్‌లో తెల్లవారుజామున 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.

కాజీపేట, రామగుండం, మంచిర్యాల జిల్లా, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, రాణి కమలపాటి, బీనా, ఝాన్సీ, అగ్రకాంట్, పాల్వాల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఈ ట్రైన్‌లో సెకండ్ ఏసి, థర్డ్ ఏసీ స్లీపర్ బోగీలో ఉంటాయి. ప్రయాణికులు www.irctc.co.in వెబ్సైట్ కి వెళ్లి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.


Also Read:

అల్లాటప్పా అంబులెన్స్‌ కాదు!

అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

Updated Date - Mar 05 , 2025 | 02:05 PM