Share News

Ambulance History: అల్లాటప్పా అంబులెన్స్‌ కాదు!

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:00 AM

అంబులెన్స్‌కు ఘనమైన చరిత్రే ఉంది. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు..

 Ambulance History: అల్లాటప్పా అంబులెన్స్‌ కాదు!

  • అలిపిరి ఘటనలో చంద్రబాబును కాపాడిన చరిత్ర

  • రుయా ప్రాంగణంలో ఇలా శిథిలావస్థలో..

ABN AndhraJyothy: ఇప్పుడంటే ఇలా తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో చెత్తాచెదారం మధ్య పడి ఉందిగానీ ఈ అంబులెన్స్‌కు ఘనమైన చరిత్రే ఉంది. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు.. వీవీఐపీలు ఎవరు తిరుమలకు వచ్చినా వారి కాన్వాయ్‌లో తిరిగేది. 2003 అక్టోబర్‌లో అలిపిరిలో నక్సల్స్‌ క్లెమోర్‌ మైన్‌ పేలుడులో గాయపడ్డ అప్పటి సీఎం చంద్రబాబును ఆగమేఘాల మీద ఆస్పత్రికి చేర్చింది ఈ అంబులెన్సే. వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా... సీఎంల కాన్వాయ్‌లోనూ ఉండేది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి సీఎం జగన్‌ తిరుమల పర్యటనకు వచ్చారు. ఆ కాన్వాయ్‌లో వెళ్లిన ఈ అంబులెన్సును అధికారులు పరిశీలించి ఇక తీసుకురావద్దని ఆదేశించారు. దాంతో ఆ స్థానంలో కొత్త అంబులెన్సు చేరిపోయింది. అప్పటికే 16 ఏళ్లు సేవలు అందించిన ఈఅంబులెన్స్‌ ఇదిగో ఇలా....మట్టిలో శిథిలమై పోతోంది.

- తిరుపతి (వైద్యం), ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 05 , 2025 | 12:41 PM