Share News

బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:13 PM

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వానికి ఉపాధ్యాయులు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ జోస్యం చెప్పారు.

బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

  • డీఎంకేకు ఉపాధ్యాయులు గుణపాఠం చెబుతారు..

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌

చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వానికి ఉపాధ్యాయులు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌లో పేజీలో... నగరంలో ఉద్యోగులు క్రమబద్ధీకరించాలంటూ ఆందోళనకు యత్నించిన కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేసి, వారిపై కేసు నమోదు చేయడం డీఎంకే ప్రభుత్వ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


డీఎంకే(DMK) ప్రభుత్వ పాలనలో ప్రాథమిక హక్కుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ వీధుల్లోకి వచ్చిన పోరాడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనకు యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో,


nani4.gif

ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు చేసిన పోరాటాలకు మద్దతు తెలిపారని, అధికారం కోసం డీఎంకే ఎన్నికల మేనిఫేస్టోలో 181వ ఇచ్చిన హామీ ఎంతవరకు అమలుచేశారని, అధికారం చేపట్టిన వెంటనే హామీలు మరిచారా? అంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో అరాచక డీఎంకే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని నయినార్‌ నాగేంద్రన్‌ జోస్యం చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 12:13 PM