Share News

GST సంస్కరణలు భారత జీడీపీని 0.8శాతం పెంచగలవు: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి

ABN , Publish Date - Sep 22 , 2025 | 02:54 PM

కొత్తగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇది స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 0.8 శాతం వరకు పెంచగలవని..

GST సంస్కరణలు భారత జీడీపీని 0.8శాతం పెంచగలవు: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
Hardeep Singh Puri

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : కొత్తగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణలు మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep Singh Puri) చెప్పారు. ఇది మన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 0.8 శాతం వరకు పెంచగలవని(GDP growth) ఆయన వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.


GST సరళీకరణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని పూరి అభిప్రాయపడ్డారు. GST సంస్కరణలు వ్యాపారాలకు సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, పన్ను విధానంలో పారదర్శకతను మెరుగుపరుస్తాయని తెలిపారు. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర(Economic Growth India) పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.


అంతేకాకుండా, GST విధానంలో సమన్వయం, సరళీకరణ ద్వారా చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు(Business Reforms) ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన పరిగణించారు. GST కౌన్సిల్ ఈ సంస్కరణలపై చర్చించి, ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేయాలని భావిస్తోందని పూరి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 03:05 PM