Kishan Reddy: తమిళనాట పెరుగుతున్న జాతీయవాదం..
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:03 AM
ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల కోసం కాకుండా వాస్తవంగానే తమిళ ప్రజలను, తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రేమిస్తున్నారని, జాతీయవాదం పెరుగుతున్నందున తమిళ ప్రజలు మోదీని ఆదరిస్తారనే నమ్మకం తనకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

- తమిళ సంస్కృతి అంటే మోదీకి ఎంతో ఇష్టం
- సత్కారసభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాజకీయాల కోసం కాకుండా వాస్తవంగానే తమిళ ప్రజలను, తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రేమిస్తున్నారని, జాతీయవాదం పెరుగుతున్నందున తమిళ ప్రజలు మోదీని ఆదరిస్తారనే నమ్మకం తనకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) తెలిపారు. మదురై జిల్లా ఎ.వళ్ళాల్‌పట్టి గ్రామంలో గురువారం సాయంత్రం టంగ్‌స్టన్ పథకాన్ని రద్దుచేసినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు అరిటాపట్టి పరిసర గ్రామాలకు చెందిన గ్రామపెద్దలు, రైతులు, వివిధ ఉద్యమ సంస్థల ప్రతినిధులు కిషన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం
ఈ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని, తమిళ సంస్కృతితోపాటు దేశ సంస్కృతి, వారసత్వ సంపదను పరిరక్షిస్తోందన్నారు. ప్రధాని మోదీని అమితంగా ఆదరిస్తున్న తమిళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు సభలలో తమిళుల సంస్కృతి, సంప్రదాయాలను, గొప్పతనం గురించి మోదీ ఎలుగెత్తిచాటారని అన్నారు. పార్లమెంట్‌లో తమిళులంతా గర్వపడేలా సెంగోల్‌ని ప్రతిష్టించారని, మోదీ తీసుకున్న ఆ చారిత్రాత్మక నిర్ణయం తమిళుల ప్రాచీన చరిత్రను యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసిందన్నారు.
ఇవన్నీ రాజకీయ స్వార్థంతో కాకుండా తమిళ ప్రజలపై తనకున్న ప్రేమ కారణంగా చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. టంగ్‌స్టన్ తవ్వకాలవల్ల కలిగే నష్టాలను ఢిల్లీకి వచ్చి అరిటాపట్టి, తదితర గ్రామాలకు చెందిన పెద్దలంతా తనకు వివరించారని, వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఆ పధకం రద్దుచేసిందన్నారు. స్థానికుల ఒత్తిడి మేరకే తాను ఈ సత్కారసభకు వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News