German Foreign Minister: భారత పర్యటనకు వచ్చిన జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్
ABN , Publish Date - Sep 02 , 2025 | 09:05 AM
జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. రేపు కూడా వాడేఫుల్ పర్యటన భారత్ లో కొనసాగుతుంది. ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థను సందర్శించి, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు.
బెంగళూరు, సెప్టెంబర్ 2: జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ ఉదయం (మంగళవారం) బెంగళూరు చేరుకున్నారు. రేపు కూడా వాడేఫుల్ పర్యటన భారత్ లో కొనసాగుతుంది. ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శించి, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు (సెప్టెంబర్ 3)న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌ను వాడేఫుల్ కలుస్తారు. ఆ తర్వాత న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమవుతారు. అదే రోజు ఆయన జర్మనీకి తిరుగు ప్రయాణమవుతారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ప్రపంచ వేదికపై భారతదేశం కీలక భాగస్వామిగా పోషిస్తున్న పాత్రను తన పర్యటనకు ముందు వాడేఫుల్ తన ఎక్స్ పోస్టులో వెల్లడించారు. జర్మనీ - భారత్ మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ఆయన తన సందేశంలో నొక్కిచెప్పారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో శక్తివంతమైందని కూడా వాడేఫుల్ అన్నారు. భద్రతా సహకారం, ఆవిష్కరణ, సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి వాటిపై ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత కీలకమని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..