Karnataka CM Race: సీఎం రేసులో ఉన్నా... కర్ణాటక హోం మంత్రి సంకేతాలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:41 PM
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన రెండున్నరేళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ కొద్ది కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడటం లేదు. తాజాగా ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర (G Parameshwara) కూడా వచ్చి చేరారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే తాను కూడా సీఎం రేసులో ఉన్నట్టు ఆయన తాజా సంకేతాలిచ్చారు. అయితే సీఎం మార్పుకు సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి ఎవరూ ఇంతవరకూ మాట్లాడలేదని, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీతోనూ చర్చించలేదని వివరించారు. మార్పు అంటూ ఉంటే పార్టీ అగ్రనేత రాహుల్‌తో చర్చించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన రెండున్నరేళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
నేను రేసులో ఎప్పుడూ ఉన్నా
కాగా, సీఎం రేసులో మీరున్నారా అనే ప్రశ్నకు జి పరమేశ్వర ఆదివారంనాడు స్పందిస్తూ, తానెప్పుడూ రేసులోనే ఉన్నానని, అది పెద్ద విషయం కాదని అన్నారు. 2013లో తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నానని, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తాము అధికారంలోకి తెచ్చామని చెప్పారు. అయితే తానెప్పుడూ ఆ క్రెడిట్‌ను ని క్లెయిమ్ చేసుకోలేదన్నారు. ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయానని, ఒకవేళ గెలిచి ఉంటే ఏమి జరిగి ఉండేదో తనకు తెలియదని అన్నారు. అప్పుడే తాను రేసులో ఉన్నానని, సహజంగా పీసీసీ అధ్యక్షుడికే ఒక ఛాన్స్ (ముఖ్యమంత్రిగా) ఇచ్చే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉండేదని, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని పాటించలేదని చెప్పారు. ఈసారి నాయకత్వ మార్పు అంటూ జరిగితే అవకాశం ఇమ్మని అడుగుతారా అని ప్రశ్నించినప్పుడు... ఆ పరిస్థితి రానీయండి.. అని జి పరమేశ్వర సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి..
సింధ్ భారత్‌లోకి రావచ్చు, సరిహద్దులు మారవచ్చు.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.