Share News

Flag Hoisting vs Flag Unfurling: జెండా ఎగురవేస్తారా లేదా ఆవిష్కరిస్తారా..వీటి మధ్య ఉన్న తేడా తెలుసా మీకు

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:03 AM

మన దేశం ఆగస్టు 15, 2025న 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా ప్రతి కార్యాలయంలోనూ జాతీయ జెండా సగర్వంగా ఎగురనుంది. కానీ, చాలామందికి జెండా ఎగురవేయడం, ఆవిష్కరించడం అనేవి వేర్వేరుగా ఉన్నాయని తెలియదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Flag Hoisting vs Flag Unfurling: జెండా ఎగురవేస్తారా లేదా ఆవిష్కరిస్తారా..వీటి మధ్య ఉన్న తేడా తెలుసా మీకు
Flag Hoisting vs Flag Unfurling

మన దేశం ఆగస్టు 15, 2025న 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు సహా అనేక చోట్ల జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకునే ఈ రోజు, మన జాతీయ జెండాను గౌరవంతో ఎగురవేసే సందర్భం కూడా. అయితే, స్వాతంత్ర దినోత్సవం సందర్భగా జెండా ఎగురవేయడం (Hoisting) అని, గణతంత్ర దినోత్సవంలో జెండా ఆవిష్కరించడం (Unfurling) అని ఎందుకు అంటారు? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


తేడా ఏంటి?

స్వాతంత్ర దినోత్సవం రోజున, అంటే ఆగస్టు 15న, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ ప్రక్రియలో జెండాను ఒక తాడుతో కింది నుంచి పైకి లాగుతారు. ఇది 1947లో బ్రిటిష్ పాలన నుంచి మనం స్వాతంత్ర్యం సాధించిన సందర్భాన్ని సూచిస్తుంది. జెండా కింది నుంచి పైకి ఎగరడం అంటే, మన దేశం స్వేచ్ఛ వైపు ఎదిగిన ప్రయాణాన్ని సంకేతాత్మకంగా చూపిస్తుంది.


పైభాగంలో కట్టి...

మరోవైపు గణతంత్ర దినోత్సవం రోజున, అంటే జనవరి 26న, రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ సమయంలో జెండా అప్పటికే గుండు పైభాగంలో కట్టి ఉంటుంది. రాష్ట్రపతి దాన్ని విప్పి ఆవిష్కరిస్తారు. ఇది 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని, మన దేశం గణతంత్ర రాజ్యంగా మారిన గౌరవాన్ని సూచిస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా కింది నుండి పైకి ఎగురుతుంది. కానీ గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం పైనుంచే ఆవిష్కరించబడుతుంది.


ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో జెండా నియమాలు

మన జాతీయ జెండాను గౌరవించడం, సరైన విధంగా ఉపయోగించడం కోసం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు జెండా గౌరవాన్ని కాపాడటానికి, అవమానం జరగకుండా చూసేందుకు రూపొందించబడ్డాయి.

  • జాతీయ జెండా నేలను, నీటిని తాకకూడదు. దాన్ని ఏ వస్తువులను తీసుకెళ్లడానికి లేదా పట్టుకోవడానికి ఉపయోగించకూడదు. కేవలం పువ్వులను మాత్రమే జెండా లోపల ఉంచాలి.

  • జెండాను తలక్రిందులుగా ఎగురవేయకూడదు. కాషాయ రంగు పట్టీ ఎప్పుడూ పైన ఉండాలి. దీన్ని వాహనాలు, విమానాలు లేదా భవనాలపై కప్పుగా ఉపయోగించకూడదు.

  • జెండాను దుస్తులు, కుషన్లు లేదా న్యాప్‌కిన్‌లపై ముద్రించకూడదు. అలాగే, దానిపై ఎలాంటి రాతలు లేదా టెక్స్ట్‌ను యాడ్ చేయకూడదు.

  • చిరిగిన లేదా గజిబిజిగా ఉన్న జెండాను ఎగురవేయడం అగౌరవంగా భావిస్తారు. జెండా ఎప్పుడూ శుభ్రంగా, మంచి స్థితిలో ఉండాలి.

  • జాతీయ జెండాను ప్రైవేట్ అంత్యక్రియల్లో డ్రేపరీగా ఉపయోగించకూడదు.


ఎందుకు ప్రత్యేకం?

స్వాతంత్ర దినోత్సవం కేవలం జెండా ఎగురవేయడం లేదా ఉత్సవాలు జరుపుకోవడం మాత్రమే కాదు. ఇది మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే రోజు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జెండా ఎగురవేసి, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు సహా అనేక ప్రాంతాల్లో జాతీయ జెండాను గౌరవంతో ఎగురవేస్తాయి.


ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 11:04 AM