Family Tragedy: ఓ తండ్రి మరణశాసనం
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:54 AM
తాడుతో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు.. మృతదేహానికి పట్టుచీర కట్టి, పూలదండలు వేసి, పెళ్లికూతురి లా ముస్తాబు చేసి ..
కూతుర్ని చంపి, వధువుగా అలంకరించి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య... తమిళనాడులో ఘటన
చెన్నై, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తాడుతో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు.. మృతదేహానికి పట్టుచీర కట్టి, పూలదండలు వేసి, పెళ్లికూతురి లా ముస్తాబు చేసి చూసుకున్నా డు. తర్వాత అదే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురికి పెళ్లి కావడంలేదని ఆవేదనతో ఓ తండ్రి చేసిన దారుణమిది. తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను కంటతడిపెట్టించింది. కనక్కంపట్టికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పళనియప్పన్(55), విజయ దంపతులకు కార్తీక, ధనలక్ష్మి(23) అనే ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కార్తీకకు వివాహమైంది. చిన్న కుమార్తె ధనలక్ష్మికి వరుడి కోసం అన్వేషించారు. ఈ లోపు ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో ఇక ఆమెకు పెళ్లికాదని పళనియప్పన్ కుమిలిపోయాడు. ఈ నెల 9న పళనియప్పన్ భార్య విజయ.. కుమారుడితో కలసి తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం ఆమె తిరుచెందూరు నుంచి భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమని ఆమె కోరింది. పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. పళనిస్వామి ఉరేసుకుని వేలాడుతుండటం, నేలపై ధనలక్ష్మి పెళ్లికుమార్తె అలంకరణతో శవంగా పడి ఉండటం కనిపించి దిగ్ర్భాం తి చెందారు. పోలీసుల విచారణలో ధనలక్ష్మికి వివాహం జరగలేదన్న కారణంగానే ఆమెను హతమార్చి, తాను ఉరివేసుకున్నాడని వెల్లడైంది.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News