Share News

Ramdas: అక్కడే రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Jan 23 , 2025 | 12:14 PM

రెండో విమానాశ్రయాన్ని పరందూరుకు ప్రత్యామ్నాయంగా తిరుప్పోరూర్‌లో నిర్మించాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్(PMK President Dr. Anbumani Ramdas) పేర్కొన్నారు.

Ramdas: అక్కడే రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయండి

- పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి సూచన

చెన్నై: రెండో విమానాశ్రయాన్ని పరందూరుకు ప్రత్యామ్నాయంగా తిరుప్పోరూర్‌లో నిర్మించాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్(PMK President Dr. Anbumani Ramdas) పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2020వ సంవత్సరం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కాంచీపురంజిల్లా పరందూరులో రెండో విమానాశ్రయానికి కావాల్సిన స్థలాన్ని అక్కడి గ్రామాల నుండి సేకరించినట్టు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: వెంబకోట తవ్వకాల్లో మట్టి ముంత, శంఖపు గాజు లభ్యం


2021 అసెంబ్లీ ఎన్నికల్లో పరందూరు(Parndur)లో విమానాశ్రయ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కేవలం డీఎంకే(DMK) ప్రభుత్వానిదేనని ఆ పార్టీ నేతలు, మంత్రులు గొప్పలు చెప్పుకున్నారని, అయితే ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రజల నుండి అభ్యంతరాలు రావడంతో అధికార పార్టీ పెదవి విప్పకుండా ఆ వ్యవహారాన్ని గతంలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంపై నిందమోపడం సరికాదన్నారు. పరందూరు విమానాశ్రయ ఏర్పాటు వ్యవహారంలో అధికార డీఎంకే(DMK) ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. పరందూరుకు ప్రత్యామ్నాయంగా చెన్నై రెండో విమానాశ్రయాన్ని తిరుప్పోరూర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని ఆయన సూచించారు.

nani3.2.jpg


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 12:15 PM