Share News

EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:54 AM

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏పై మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు అంటూ పేర్కొన్నారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఒకే వెర్షన్‌ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్‌ మాత్రమేనని ఈపీఎస్‌ తెలిపారు.

EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు

- సీఎంపై ఈపీఎస్‌ ఆగ్రహం

చెన్నై: ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా ప్రకటనలు గుప్పిస్తున్న డీఎంకే పాలన ఇక చాలని, దీనిని కూడా గొప్పగా ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Planiswami) ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాలుగేళ్ల డీఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, బూటకపు ఎన్‌కౌంటర్లు పెరిగాయని, ఇవన్నీ స్టాలిన్‌ పాలనలోని విశేషాలని ఎద్దేవా చేశారు.

ఈ వాన్తను కూడా చదవండి: India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..


రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతయ్యాయని చెప్పటానికి డీఎంకే విదేశీ తమిళుల విభాగమే ప్రధాన సాక్ష్యమన్నారు. సామాజిక న్యాయం ఏమేరకు కాపాడబడుతోందో వైంగైవయల్‌ సంఘటన సాక్ష్యం చెబుతుందని తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్‌ గంజాయి 2.0, 3.0, 4.0 అన్నీ విఫలమయ్యాయని, ఇవి చాలవన్నట్లు స్టాలిన్‌ రాష్ట్రంలో రానున్నది ద్రావిడ తరహా పాలన 2.0అని ప్రగల్భాలు చెప్పటం గర్హనీయమన్నారు.


అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తలెత్తుకుని నడిచిన రాష్ట్రం ఇప్పుడు బెయిలుపై విడుదలైన నేరస్థులందరికీ త్యాగులుగా అవార్డులిచ్చి తలదించుకునేలా చేసిన ఘనత స్టాలిన్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ‘బై...బై స్టాలిన్‌’ అంటూ వీడ్కోలు పలకడం తథ్యమన్నారు. 2026లో ఒకే వెర్షన్‌ మాత్రమేనని, అది రాష్ట్రంలో అన్నాడీఎంకే వెర్షన్‌ మాత్రమేనని ఈపీఎస్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

మహిళపై చేయిచేసుకున్న పోలీస్

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2025 | 11:54 AM